పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులుండటం కామన్. ఆయన సినిమాలు వచ్చాయంటే వారికి పండుగే పంగ. సినిమా టైటిల్ రిలీజ్ అయిన దగ్గరి నుంచి సినిమా రిలీజ్ అయ్యే వరకు వాళ్లు చేసే ప్రమోషన్ అంతా ఇంతా కాదు. థియేటర్ల దగ్గర తమ అభిమాన హీరో కటౌట్లు, దండలు, కొబ్బరికాయలు, స్వీట్లు..  విజిల్స్ తో రచ్చరచ్చ చేస్తారు. దీంతో థియేటర్లకు వచ్చే ప్రేక్షకులకు కూడా ఉత్సాహం ఉరకలెత్తుతుంది. అంతటి క్రేజ్ సంపాదించుకున్న హీరోకు ఒక హీరో అభిమాని అంటే శ్చర్యమేస్తుంది.  
పవన్‌ కళ్యాణ్‌కి పెద్ద ఫ్యాన్‌ని అని నితిన్‌ చాలాసార్లు చెప్పాడు. ఆడియో ఫంక్షన్‌, ప్రీ రిలీజ్‌ ఈవెంట్ ఇలా ఎక్కడో ఒక చోట జై పవర్‌ స్టార్ అని స్లోగన్స్ చెబుతుంటాడు. అలాంటి ఫేవరెట్‌ హీరోకి ఎదురు వెళ్తున్నాడు నితిన్. పవర్‌ స్టార్‌ వర్సెస్‌ యూత్‌ స్టార్ అనే ఫైటింగ్‌కి తెరలేపుతున్నాడు.

నితిన్‌ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి దాదాపుగా రెండు దశాబ్ధాలు అవుతోంది. లవ్‌స్టోరీస్, మాస్‌ మూవీస్‌, థ్రిల్లర్స్‌ అని రకరకాల కాన్సెప్టులతో సినిమాలు చేస్తోన్నా ఇంకా టాప్‌ లీగ్‌కి దూరంగానే ఉన్నాడు. నంబర్‌ గేమ్‌లో వెనకబడిపోయాడు. ఇలాంటి స్టేజ్‌లో ఉన్న నితిన్, తన ఫేవరెట్‌ హీరో టాలీవుడ్‌ టాప్‌స్టార్ పవన్‌ కళ్యాణ్‌తో పోటీ పడుతున్నాడు. పవన్‌ కళ్యాణ్‌కి నితిన్ వీరాభిమాని. ఈ అభిమానంతోనే 'గుండెజారి గల్లంతయ్యిందే' సినిమాలో 'తొలిప్రేమ'లోని "ఏమందో ఏమో ఈ వేళ" పాటని రీమిక్స్‌ చేశాడు నితిన్. అయితే ఇంత అభిమానం చూపించే నితిన్, ఇప్పుడు పవన్ 'హరి హర వీరమల్లు' సినిమాతో పోటీ పడుతున్నాడు.

నితిన్ ప్రస్తుతం ఎమ్.ఎస్.రాజశేఖర్‌ రెడ్డి దర్శకత్వంలో 'మాచర్ల నియోజకవర్గం' అనే సినిమా చేస్తున్నాడు. మాస్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 29న విడుదలవుతోంది. ఇక ఇదే డేట్‌కి పవన్‌ 'హరి హర వీరమల్లు' విడుదలవుతోంది. దీంతో పవన్‌ వస్తున్నాడు అని తెలిసి ఇదే డేట్‌కి నితిన్ ఎలా బరిలో దిగుతున్నాడు అని సినీ జనాలు కూడా ఆశ్చర్యపోతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: