ప్రస్తుతం భారత క్రికెట్లో క్రికెట్ దేవుడిగా కొనసాగుతున్నారు సచిన్ టెండూల్కర్. ఎన్నో ఏళ్ల పాటు భారత క్రికెట్ జట్టుకు సేవలు అందించిన సచిన్ టెండూల్కర్ ఇప్పటికీ ఎంతోమంది యువ ఆటగాళ్లకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు అని చెప్పాలి. అయితే భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తన కంటే వయసులో పెద్ద అయిన అంజలి అనే మహిళను పెళ్లి చేసుకున్నారూ. అప్పట్లో సచిన్ టెండూల్కర్ పెళ్లి హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే ఈ దంపతులకు సారా టెండూల్కర్ అర్జున్ టెండూల్కర్  అనే ఇద్దరు సంతానం ఉన్నారు  కాగా ప్రస్తుతం సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ కూడా ఒక క్రికెటర్ కావడం గమనార్హం. కానీ తండ్రి స్థాయిలోరాణించలేక పోతున్నాడు.


 అయితే అటు సారా టెండూల్కర్ మాత్రం ఇప్పటివరకు ఏ రంగంలోకి అడుగు పెట్టలేదు. కానీ అటు గత కొంత కాలం నుంచి మాత్రం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. భారత యువ ఆటగాడు శుబ్ మన్ గిల్ తో సరదాగా సోషల్ మీడియాలో సంభాషించడం తో  వీరిద్దరూ రిలేషన్ షిప్ ఉన్నారు అంటూ ఎన్నో వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఇక ఈ వార్తలపై ఇప్పటివరకు ఎవరూ కూడా స్పందించక పోవడం గమనార్హం. ఇటీవలే సారా టెండూల్కర్ సింగర్ కనికా కపూర్ తో నైట్ డేట్ కు వెళ్లడం మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.


 ఇకపోతే మరోసారి ఇప్పుడు సోషల్ మీడియాలో సారా హాట్ టాపిక్ గా మారిపోయింది. ఎందుకంటే సారా టెండూల్కర్ ఇక ప్రస్తుతం మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టినట్లు తెలుస్తోంది. ప్రముఖ క్లాతింగ్ బ్రాండ్కు ఆమె మోడల్ గా వ్యవహరించడం గమనార్హం. ఇందుకు సంబంధించిన వివరాలను వీడియోను ఇటీవలే తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది సారా టెండూల్కర్. ఇక ఇందులో భాగంగా నటి బనిత సందు, తానియా శ్రాఫ్తో కలిసి సారా టెండూల్కర్  ఫ్యాషన్ దుస్తుల్లో మెరిసింది. ఈ క్రమంలోనే సారా టెండూల్కర్ మోడలింగ్ లో బాగా రాణించాలని ఎంతోమంది అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆల్ ది బెస్ట్  చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: