సినీతారలకు అభిమానులు ఉండటం సహజం. వారి స్టయిల్,నటన,డ్యాన్స్ బయట వారు విధానం అందరికి నచ్చుతాయి.అందుకే కోట్ల మంది అభిమానులు ఉంటారు. వారి నుంచి సినిమా వస్తుంది అంటే సోషల్ మీడియా లో ,బయట హంగామా మాములుగా ఉండదు. అందరి హీరో ల అభిమానుల హడావిడి ఒకరకం అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ హంగామా మాములుగా ఉండదు.


ఆయన సినిమాల లోనే కాకుండా బయట కూడా అభిమానులు ఉన్నారు.జనసేన నాయకుడు గా ఆయన జనం కోసం చేసే పోరాటాలు జనాలను విపరీతంగా ఆకట్టుకుంటాయి. అందుకే పవన్ అభిమానులు దేవుడుగా భావిస్తారు. ఇప్పుడు ఓ అభిమాని అతని పై అభిమానాన్ని వెరైటీ గా చూపించారు. తన పెళ్ళి కార్డు లో పవన్ కళ్యాణ్ ఫోటో వేశాడు. అంతే కాదండోయ్ కాస్త మ్యాటర్ కూడా యాడ్ చేసాడు. అది ఇప్పుడు నెట్టింట వైరల్ అయ్యింది.


వివరాల్లొకి వెళితే.. శ్రీకాకుళం లోని తమ్మినేని శ్రీనివాస్‌ అనే వ్యక్తి పవన్ కు పెద్ద ఫ్యాన్.ఈ నెల 18 న అతని వివాహం.తన లైఫ్ లో జరిగే అతి పెద్ద శుభకార్యం కావడం తో అతను పవన్ ఫోటోను వేయించుకున్నాడు.దేవుడి ఫోటో కు బదులు పవన్ ఫోటో ను వేశావు అంటే అతను సింపుల్ గా నా దేవుడు పవన్ కళ్యాణ్ అని సమాధానం చెబుతున్నాడు. ఇది నిజంగా విడ్డూరమే. ఇకపోతే భోజనానికి వాడే గ్లాసులు,ప్లేట్స్ లకు కూడా పవన్ ఫోటో ను వేయించాడు.ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పిచ్చి ముదిరింది అంటూ కామెంట్లు చేస్తున్నారు..ప్రస్తుతం ఈ విషయం చర్చలకు దారి తీసింది. పవన్ కళ్యాణ్ వరుస సినిమా లతో బిజిగా ఉన్నాడు. ఇప్పుడు భీమ్లా నాయక్ సినిమా లో నటిస్తున్నాడు.. వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: