కొంతమంది హీరోలు కొంతమంది దర్శకులతో పదేపదే సినిమాలు చేస్తూ ఉంటారు. వారు చేసిన ఆ సినిమాలు కూడా సూపర్ హిట్ అవ్వడంతో ఇండస్ట్రీలో వారు బెస్ట్ పైర్ గా ఉంటారు. అలా టాలీవుడ్ లో కొంతమంది దర్శక హీరోలు కలిసి డజనుకు పైగా సినిమాలు చేయగా ఇప్పటి కాలంలో మూడు సినిమాలు చేసి కొంతమంది దర్శక హీరోలు సూపర్ హిట్లు సాధించారు. వారి కెరీర్ లోనే అవి మంచి సినిమా లు గా ఉన్నాయి. అలా తెలుగు సినిమా పరిశ్రమలో అల్లు అర్జున్ తో ఇద్దరు ఇద్దరు మూడు చిత్రాలు చేయగా అవి ప్రేక్షకులను కూడా విపరీతంగా అలరించాయని చెప్పవచ్చు. 

ఆ విధంగా సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ చేసిన మూడవ సినిమా పుష్ప రేపు ప్రేక్షకుల ముందుకు  రాబోతుంది. భారీ స్థాయిలో అంచనాలు ఉన్న ఈ చిత్రంపై అల్లు అర్జున్ అభిమానులు ఎంతో నమ్మకాన్ని పెట్టుకోగా పాన్ ఇండియా సినిమా గా రాబోతున్న ఈ చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుందని నమ్మకం వ్యక్తపరుస్తున్నారు చిత్ర యూనిట్. గతంలో వీరు కలిసి ఆర్య మరియు ఆర్య 2 అనే రెండు సినిమాలు చేయగా అవి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దాంతో వీరి కాంబినేషన్ లో రాబోతున్న ఈ మూడవ చిత్రం సూపర్ హిట్ అయి వీరికి హ్యాట్రిక్ హిట్ ను కలగజేయాలని అందరూ కోరుకుంటున్నారు.

ఇక అల్లు అర్జున్ తో మూడు సినిమాలు చేసి సూపర్ హిట్ సాధించిన రెండవ దర్శకుడిగా సుకుమార్ నిలవబోతున్నాడు. అల్లు అర్జున్ తో మూడు సినిమాలు చేసి ఇప్పటికే సూపర్ హిట్లు కొట్టాడు త్రివిక్రమ్. వీరిద్దరి కలయికలో తొలుత జులాయి అనే సినిమా రాగా ఆ తర్వాత సన్నాఫ్ సత్యమూర్తి అనే సినిమా చేసి హిట్స్ సాధించారు. మూడో సినిమా గా అల వైకుంఠపురం లో చిత్రం చేయగా అది మంచి సక్సెస్ సాధించింది. ఈ నేపథ్యంలో వీరి కాంబినేషన్ లో నాలుగో సినిమా కోసం అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఎవరికి వారు వారి వారి సినిమాలతో బిజీగా ఉన్న నేపథ్యంలో వీరి కలయిక లో మరో సినిమా ఎప్పుడు సెట్ అవుతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: