సైరా నరసింహా రెడ్డి తర్వాత కొరటాల శివతో ఆచార్యకి కొద్దిగా టైం ఎక్కువ తీసుకున్న మెగాస్టార్ చిరంజీవిసినిమా రిలీజ్ అయ్యే లోగా మరో నాలుగైదు సినిమాలను లైన్ లో పెట్టాడు. లూసిఫర్ రీమేక్ గా గాడ్ ఫాదర్, వేదాళం కథతో భోళా శంకర్ సినిమాలు చేస్తున్న చిరు కె.ఎస్ రవీంద్ర సినిమా కూడా చేస్తున్నాడు. రీసెంట్ గా యువ దర్శకుడు వెంకీ కుడుములతో కూడా సినిమా ఓకే చేశాడు మెగాస్టార్. ఈ ఐదు సినిమాలతో చిరంజీవి పెద్ద టార్గెట్ పెట్టుకున్నాడని తెలుస్తుంది.

ఒక్కో సినిమాకు 40 కోట్ల చొప్పున రెమ్యునరేషన్ తీసుకుంటున్న మెగాస్టార్ చిరంజీవి ఈ ఐదు సినిమాలతో 200 కోట్ల టార్గెట్ పెట్టుకున్నారట. 2022లో సెకండ్ హాఫ్ లో లైన్ లో పెట్టిన 3 సినిమాలు పూర్తి చేసే ఆలోచనలో ఉన్న చిరంజీవి మళ్లీ మరో రెండు సినిమాలు ఎనౌన్స్ చేస్తారని తెలుస్తుంది. అందులో వినాయక్ డైరక్షన్ లో సినిమా కూడా ఉంటుందని టాక్. మొత్తానికి చిరంజీవి 40 కోట్ల రెమ్యునరేషన్ తో వరుస సినిమాలతో పెద్ద టార్గెట్ పెట్టుకున్నారని అర్ధమవుతుంది.

ఆచార్య ఫిబ్రవరి 4న రిలీజ్ ఫిక్స్ చేయగా గాడ్ ఫాదర్ సమ్మర్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. భోళా శంకర్ సినిమా కూడా 2022 లోనే రిలీజ్ అని తెలుస్తుంది. సో నెక్స్ట్ ఇయర్ మెగాస్టార్ చిరంజీవి 3 సినిమాలతో ఫ్యాన్స్ ను అలరించనున్నారు. ఈ వయసులో కూడా కుర్ర హీరోలకు ఏమాత్రం తగ్గని విధంగా వరుస సినిమాలతో చిరు సత్తా చాటుతున్నారు. మెగాస్టార్ చేస్తున్న ఈ సినిమాలన్ని ఒకదానికి మించి మరొకటి అనిపించేలా ఉన్నాయి. మరి 2022 చూస్తుంటే మెగా నామ సంవత్సరం గా మెగా ఫ్యాన్స్ అందరు పండుగ చేసుకునేలా ఉంది. మరి ఈ మెగా హంగామా ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: