ప్రస్తుతం స్టార్స్ గా సత్తా చాటుతున్న భామలంతా వారి పర్సనల్ లైఫ్ లో స్పెషల్ క్వాలిటీస్ ఉండి ఉంటాయి. వారి ఎడ్యుకేషన్.. వారి స్పెషల్ ఇంట్రెస్ట్. అవి తెలుసుకోవాలని ఆడియెన్స్ కు ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ప్రస్తుతం రష్మిక మందన్న గురించి తెలుసుకుంటే.. అమ్మడు ప్రస్తుతం సౌత్ లో నెంబర్ 1 స్టార్ హీరోయిన్ గా దూసుకెళ్తుంది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఆమె నటిస్తుంది.

చిన్నప్పుడే మేగజైన్ కవర్ పేజ్ కి ఎక్కిన రష్మిక మందన్న కన్నడ సినిమా కిరిక్ పార్టీ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయ్యింది. ఇక ఈ రష్మిక ఎడ్యుకేషన్ విషయానికి వస్తే అమ్మడు సైకాలజీలో బ్యాచిలర్ డిగ్రీ పొందినట్టు తెలుస్తుంది. అందుకే తను చేసిన ప్రతి పాత్రలో ఆమె ఈజీగా నటించేస్తుంది. అంతేకాదు రష్మిక మందన్న జర్నలిజం ఇంకా ఇంగ్లీష్ లిటరేచర్ కూడా చేసినట్టు తెలుస్తుంది. మోడల్ గా చేస్తూ వస్తున్న ఆమెకు కన్నడలో కిరిక్ పార్టీ ఆఫర్ వచ్చింది. మొదటి సినిమాతోనే రష్మిక అక్కడ సూపర్ క్రేజ్ ఏర్పరచుకుంది.

కిరిక్ పార్టీ హీరో రక్షిత్ శెట్టితో ఎంగేజ్మెంట్ కూడా జరుపుకుంది రష్మిక. అయితే మధ్యలో కొన్ని అనివార్య కారణాల వల్ల ఆమె అతనితో పెళ్లిని క్యాన్సిల్ చేసుకుంది. ప్రస్తుతం సౌత్ లో రష్మిక వరుస క్రేజీ సినిమాలతో తన సత్తా చాటుతుంది. ఈమధ్యనే పుష్ప సినిమా ద్వారా అమ్మడు శ్రీవల్లి పాత్రలో తన టాలెంట్ చూపించింది. హిందీలో కూడా రష్మిక రెండు సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. రష్మిక మందన్న విజయ్ దేవరకొండ చాలా క్లోజ్ గా ఉంటారని అందరికి తెలుసు. వీళ్లిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అని టాక్. షూటింగ్ లేకపోతే విజయ్ ఎక్కడ ఉంటే రష్మిక అక్కడ ప్రత్యక్షమవుతుంది. వీరి మధ్య ఏం జరుగుతుంది అన్నది వీరు ఓపెన్ అయితేనే కాని తెలుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: