హిందువులకు పెద్ద పండుగ సంక్రాంతి. ఈ పెద్ద పండుగకు సంబరాలు కూడా అంతే ఘనంగా జరుగుతాయి. ప్రతి హిందువు ఇంట్లో పచ్చటి తోరణాలు, పిండి వంటల గుమగుమలు, ఒక్కచోట చేరిన బందువుల సందడి, కొత్త అల్లుళ్ల కోలాహలం, కోడిపందేలు, ఇంటి ముందు గొబ్బెమ్మలు, రంగు ముగ్గులు, భోగి మంటలు ఇలా ప్రతీది ప్రత్యేకమే, వైభోగమే. అయితే సంక్రాంతి నేపథ్యంలో చాలా తెలుగు చిత్రాలే వచ్చాయి. మన సంస్కృతి సాంప్రదాయాల విలువను తెలియచెప్పే విధంగా వచ్చే సినిమాలలో ముఖ్యంగా సంక్రాంతి, వినాయక చవితి పండుగల గురించే ఎక్కువగా కనిపిస్తుంటాయి.

సినిమా మొత్తం అదే కాన్సెప్ట్ పై ఉండదు. కానీ ఆ పండుగ కాన్సెప్ట్ చిత్రానికి హైలెట్ గా ఉండేలా మాత్రం చూసుకుంటారు దర్శకులు. అదే చాలా వరకు సినిమాలకు కలిసొచ్చి విజయాన్ని తెచ్చిపెడతాయి. ఇదే రీతిలో
నేరుగా సంక్రాంతి పండుగ పేరుపై వచ్చిన సినిమా సంక్రాంతి. మల్టీ స్టారర్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్, శ్రీకాంత్, శివ బాలాజీ, శర్వానంద్, ఆర్తి అగర్వాల్, స్నేహ తదితరులు ముఖ్య భూమిక పోషించారు.  
క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ ను అందుకుంది. అయితే ఈ సినిమా వలన ఇండస్ట్రీకి ఒక మంచి హీరో లభించాడనే చెప్పాలి.

ఈ సినిమాలో శర్వానంద్ తన అద్భుతమైన నటనను కనబరిచారు. ఈ చిత్రం తోనే ప్రేక్షకులు శర్వానంద్ లోని నటనా ప్రతిభను ఈ కుర్రాడికి మంచి ఫ్యూచర్ ఉంది అని ప్రశంసలు వినిపించాయి. ముఖ్యంగా ఈ సినిమా వలనే శర్వానంద్ కు ఇండస్ట్రీలో పలు అవకాశాలు లభించాయని చెప్పాలి. అంతకు ముందు 'శంకర్ దాదా ఎంబిబిఎస్', 'గౌరీ' వంటి పలు చిత్రాల్లో ముఖ్యపాత్రలు పోషించినా పెద్దగా గుర్తింపు దక్కలేదనే చెప్పాలి. అయితే ఈ సినిమా శర్వా కెరియర్ కి బాగా ప్లస్ అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: