నిత్యా మీనన్‌ పెర్ఫామెన్స్‌కి బోల్డన్ని అవార్డులు వచ్చాయి. జూనియర్ సౌందర్య అనే ఇమేజ్‌ కూడా తెచ్చుకుంది. అయితే నిత్య నటనకి ఎన్ని ప్రశంసలు వచ్చాయో, బరువు పెరిగాక అన్ని ట్రోల్స్ వచ్చాయి. నిత్య బరువు పెరిగాక హీరోయిన్‌ మెటీరియల్‌ కాదని విమర్శించారు. దీనిపైనా నిత్య మీనన్ కూడా కొన్ని సందర్భాల్లో రియాక్ట్ అయ్యింది. ఆరోగ్య సమస్యలతోనూ బరువు పెరుగుతారు. కానీ అవేమి తెలుసుకోకుండా విమర్శిస్తారని బాధపడింది నిత్య. రకుల్‌ ప్రీత్‌ సింగ్ తెలుగు నుంచి మొదలుపెట్టి హిందీ వరకు మల్టిపుల్ లాంగ్వేజస్‌లో సినిమాలు చేస్తోంది. మిస్‌ ఇండియా-2011 పోటీల్లో అయిదు టైటిల్స్‌ కూడా గెలుచుకుంది. కానీ సినిమాల్లోకి వచ్చిన కొత్తలో రకుల్‌ కూడా బాడీ షేమింగ్‌ ఫేస్‌ చేసింది. కటౌట్ పర్వాలేదు గానీ, ముఖం చాలా సాధారణంగా ఉందని పక్కనపెట్టేశారట. అయితే ఆ తర్వాత 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్'తో కెరీర్‌ స్పీడ్‌ ట్రాక్ ఎక్కింది. ఇప్పుడు బాలీవుడ్‌లో సెటిల్‌ అయిపోయింది.

ఇలియానా 'పోకిరి' టైమ్‌లో గుడి కట్టేంత ఫాలోయింగ్ తెచ్చుకుంది. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌ అయ్యింది. అయితే ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఇల్లీ కటౌట్‌పైనా కామెంట్స్‌ వచ్చాయట. చాలామంది అందం పెంచుకోవడానికి సర్జరీస్‌ చేయించుకోమని సలహాలిచ్చారట. అసలు 12 ఏళ్ల నుంచే నేను బాడీ షేమింగ్‌ని ఎదుర్కొన్నా, వయసుతో పాటు టీజింగ్‌ కూడా పెరిగిందని ఒక ఇంటర్వ్యూలో వాపోయింది ఇలియానా. హీరోయిన్లందరికీ అభిమానులు ఉంటే ఖుష్బూకి తమిళనాట భక్తులు ఉన్నారు. ఈ భక్తితోనే గుడి కట్టించారు. అయితే ఈ అభిమానంతో పాటు, బాడీ షేమింగ్‌నీ ఫేస్ చేసింది. బరువు పెరిగాక చాలామంది ఖుష్బూ కటౌట్‌ని కామెంట్ చేశారు. అలాగే ఖుష్బూ కూతుళ్లని ఇతర సెలబ్రిటీ డాటర్స్‌తో పోల్చుతూ కామెంట్ చేశారు. ఇక కూతుళ్లని అనగానే ఖుష్బూ వెంటనే రియాక్ట్‌ అయింది. ఇన్‌స్టాగ్రామ్‌లో బాడీషేమింగ్‌ చేసిన యూజర్స్‌కి వార్నింగులు ఇచ్చింది.

ఓపెన్‌గా మాట్లాడడంలో పోటీలు పెడితే సమీరా రెడ్డికి బోల్డన్ని గోల్డ్‌ మెడల్స్‌ వస్తాయి. డిప్రెషన్‌ నుంచి స్టార్ట్‌ చేస్తే డిక్టేటర్స్‌ వరకు అన్నింటిని టచ్‌ చేసే సమీరా రెడ్డి హీరోయిన్‌గా ఉన్నప్పుడు బాడీషేమింగ్‌ని ఫేస్‌ చేశానని చెప్పింది. డార్క్ స్కిన్‌ టోన్‌ని లైట్‌గా మార్చుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశానని, లెన్సులు వాడేదాన్నని చెప్పింది. అయితే ఇప్పుడు ఆలోచిస్తే నామీద నాకే జాలేస్తోందని, మనల్ని మనం యాక్సెప్ట్‌ చేసుకున్నప్పుడే ఆనందంగా ఉంటామని ఒక వీడియో కూడా రిలీజ్‌ చేసింది సమీరా రెడ్డి.
ఎలాంటి క్యారెక్టర్ అయినా సరే, వందశాతం న్యాయం చేసే హీరోయిన్లలో అందరికంటే ముందు ఉంటుంది రాధికా ఆప్టే. 'పాడ్‌మాన్, లస్ట్‌ స్టోరీస్, అంధాదున్' లాంటి సినిమాలతో విమర్శకులని మెప్పించింది. అయితే రాధిక యాక్టింగ్‌కి ఎన్ని ప్రశంసలు దక్కుతున్నాయో, ఆమె లుక్‌పైనా అన్ని కామెంట్స్‌ వస్తున్నాయి. రాధిక ఇంగ్లీష్ యాక్సెంట్‌ నుంచి మొదలుపెట్టి కటౌట్‌ వరకు అన్నింటిపైనా ట్రోలింగ్‌ జరుగుతూ ఉంటుంది. రాధికది అసలు హీరోయిన్ కటౌట్ కాదని, డార్క్ స్కిన్‌ అని కామెంట్లు పెడుతుంటారు.


మరింత సమాచారం తెలుసుకోండి: