సినిమా ఇండస్ట్రీ లోకి ప్రతి సంవత్సరం ఎంతో మంది హీరోయిన్ లు ఎంట్రీ ఇస్తూ ఉంటారు, అలా ఎంట్రీ ఇచ్చిన వారిలో కొంతమంది మొదటి సినిమాలతోనే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకని ఆ తర్వాత కూడా వరుస క్రేజీ సినిమా అవకాశాలను దక్కించుకుంటారు. అయితే అలా నటించిన మొదటి సినిమాతోనే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకొని ప్రస్తుతం కూడా వరుస క్రేజీ సినిమా అవకాశాలను దక్కించుకుంటున్న ముద్దుగుమ్మలలో శ్రీ లీల ఒకరు. శ్రీ లీల, శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా, గౌరీ రోనాంకి దర్శకత్వంలో, దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన పెళ్లి సందD సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమాకు ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని సమకూర్చాడు, ఈ సినిమాకు ఎం.ఎం.కీరవాణి సమకూర్చిన సంగీతానికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. విడుదలకు ముందు నుండే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగివున్న ఈ సినిమా 15 అక్టోబర్ 2021 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది, థియేటర్ లలో విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించడంతో పాటు శ్రీ లీల నటనకు,  అందచందాలకు తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు దక్కడంతో ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ సినిమా అవకాశాలు దక్కుతున్నాయి.

అందులో భాగంగా ఈ ముద్దుగుమ్మ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో మొదటి సినిమా విజయంతోనే ఫుల్ క్రేజీ సినిమా ఆఫర్ లను దక్కించుకుంటున్న శ్రీ లీల కు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే ప్రస్తుతం శ్రీ లీల కాల్షీట్లు కావాలంటే కోటి  రూపాయల వరకు డిమాండ్ చేస్తోందట, ఇలా శ్రీ లీల నటించిన ఒకేఒక్క సినిమాతో టాలీవుడ్ లో ఫుల్ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: