గత ఏడాది ఆరంభంలో 'క్రాక్' తో సంచలన విజయాన్ని నమోదు చేసిన రవితేజ ఈ ఏడాది మొదట్లోనే 'ఖిలాడి' సినిమాని థియేటర్లలోకి దింపేశాడు. కోనేరు సత్యనారాయణ నిర్మించిన ఈ చిత్రానికి రమేశ్ వర్మ దర్శకత్వం వహించాడు.మాస్ మహారాజా రవితేజ స్టైలీష్ లుక్,మాస్ కంటెంట్ ఇంకా ఇద్దరు భామలతో రొమాన్స్ అలాగే ఆయన ఎనర్జీ లెవెల్స్ కి తగిన పాటలు ఈ సినిమాపై ఎన్నో భారీ అంచనాలు పెంచుతూ వెళ్లాయి. పోస్టర్స్ నుంచే అందరిలో ఆసక్తిని పెంచుతూ వచ్చిన ఈ సినిమా భారీ స్థాయిలో నిన్న విడుదల అయ్యి ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ సినిమా మొదటి ఆటతోనే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. 

విడుదలైన అన్ని ప్రాంతాల్లోను మాస్ మహారాజా రవితేజ మార్క్ సినిమా అనిపించుకుంది. తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు ఈ సినిమా వసూళ్ల విషయానికి వస్తే నైజామ్ లో ఈ సినిమా 1.86 కోట్ల షేర్ ను రాబట్టడం జరిగింది.ఇక ఏపీలో కూడా ఈ సినిమా 1.88 కోట్ల షేర్ ను వసూలు చేసింది. అలాగే ఏరియాల వారీగా కనుక చూసుకుంటే నైజామ్లో 1.86 కోట్లు .. సీడెడ్లో 56 లక్షలు .. వైజాగ్లో 46 లక్షలు .. ఈస్ట్లో 26 లక్షలు .. వెస్ట్లో 21 లక్షలు .. కృష్ణాలో 18 లక్షలు .. గుంటూరులో 56 లక్షలు .. నెల్లూరులో 21 లక్షల షేర్ ను ఈ సినిమా రాబట్టింది.

ఇక ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం నైట్ కర్ఫ్యు అమల్లో ఉంది .. అందువలన సెకండ్ షోస్ కి అలో లేదు. ఇక మిగిలిన ఆటలన్నీ కూడా కేవలం 50 శాతం ఆక్యుపెన్సీతో నడవాల్సిందే. ఇక మరో వైపున టికెట్ల రేట్లు కూడా తక్కువగా ఉన్నాయి. ఇన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నా కూడా ఈ సినిమా ఇక్కడ ఈ స్థాయి ఓపెనింగ్స్ ను రాబట్టడం మంచి విశేషమేనని చెబుతున్నారు. రెండు రాష్ట్రాల్లోను కలుపుకుని ఈ సినిమా మొదటి రోజున 4.30 కోట్ల షేర్ ను వసూలు చేసింది. ఇక పాజిటివ్ టాక్ రావడం ద్వారా వీకెండ్ లో ఈ సినిమా వసూళ్లు పెరిగే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: