ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నవీన్ చంద్ర నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. అందాల రాక్షసి అనే సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయమైన నవీన్ చంద్ర.. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాకుండా తన నటనతో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నాడు. ఇక ఆ తర్వాత దళం, త్రిపుర, లక్ష్మీదేవికి ఓ లెక్కుంది, మీలో ఎవరు కోటీశ్వరుడు, జూనియర్ లవర్ ఆఫ్ ఇడియట్ లాంటి సినిమాలతో హీరో గా తెలుగు ప్రేక్షకులను అలరించాడు.


 కేవలం  హీరోగా మాత్రమే సరిపెట్టుకోకుండా వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు నవీన్ చంద్ర.. ముఖ్యంగా అరవింద సమేత సినిమాలో పవర్ ఫుల్ విలన్ పాత్రలో నటించిన  ప్రేక్షకుల అందరిని ఆశ్చర్యపరిచాడు. అంతే కాదు పలు వెబ్ సిరీస్ లో కూడా నటించి తన నటనతో మెప్పించాడు నవీన్ చంద్ర. అయితే నవీన్ చంద్ర సినీ కెరీర్ గురించి అందరికీ తెలుసు. కానీ పర్సనల్ లైఫ్ గురించి మాత్రం దాదాపు చాలా మందికి తెలియదు. ఎందుకంటే ఈ హీరో పర్సనల్ లైఫ్ గురించి ఎక్కడా ప్రస్తావించలేదు కూడా.


 కానీ ఇటీవలే ప్రేమికుల రోజున తన అభిమానులు అందరికీ సర్ప్రైజ్ ఇచ్చాడు ఈ హీరో. తన సతీమణిని అందరికీ పరిచయం చేశాడు. తన భార్య తో దిగిన ఫోటో నీ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు నవీన్ చంద్ర. ప్రేమ ఎప్పటికీ గుండెల్లో నిలిచి ఉంటుంది. హ్యాపీ వాలెంటైన్స్ డే నా బెటర్ హాఫ్ ఓర్మా అంటూ ఇంస్టాగ్రామ్ లో ఫోటో షేర్ చేశాడు నవీన్ చంద్ర. ఇక ఈ ఫోటో కాస్త వైరల్ గా మారిపోయింది. అభిమానులు అందరిని ఆకర్షిస్తుంది. ఇది చూసిన తర్వాత క్యూట్ కపుల్స్ అంటూ అభిమానులు ఈ దంపతులకు కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: