సోనాల్ చౌహాన్.. సినీ ఇండస్ట్రీలో ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు.. యంగ్ హీరోల సరసన తన కెరియర్ ను ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత బాలకృష్ణ లాంటి స్టార్ హీరో సరసన బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి అలరించింది.. ఆరంభం మొదట్లో హ్యాపీడేస్ రాహుల్ సరసన రెయిన్ బో అనే చిత్రంలో నటించి మెప్పించిన సోనాల్ , ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని బాలయ్య సరసన లెజెండ్ సినిమాలో నటించి అందరినీ అలరించింది. ఇక తన అందచందాలతో కుర్రకారును కట్టిపడేస్తుంది.. తెలుగు సినీ ఇండస్ట్రీ లో నటిస్తోంది అంటే అది కేవలం బాలయ్య బాబు తోనే అని అప్పట్లో వార్తలు కూడా వినిపించాయి.. ఇక ఎన్ని సినిమాలలో నటించిన ఈమెకు ఆశించనంత అయితే అవకాశాలు రాలేదు.. అందుకే సోషల్ మీడియాలో నిరంతరం అభిమానులకు దగ్గరవడానికి ఫోటో షూట్లు చేస్తూ భారీగా ఫాలోయింగ్ పెంచుకుంది..


తాజాగా బ్లాక్ డ్రెస్ వేసుకొని ముత్యాలహారం తో బెడ్ పై కూర్చొని ఉన్న సోనాల్ ఫోటో ని చూసి అభిమానులు మంత్రగత్తె ముత్యాలహారం కథ ఏమిటి.. ఈ కానుక ఇచ్చింది ఎవరు.. అంటూ ప్రశ్నిస్తున్నారు.. ఇకపోతే ఎప్పుడు బికినీలు వేసుకుని బీచ్ లో సెలబ్రేషన్స్ తో అలరించే సోనాల్ ఈసారి సరికొత్తగా ప్రయత్నం చేసిందని చెప్పవచ్చు.. ఇక తాజాగా సోనాల్ ఏంజెలిన్ తరహాలో తన వేషధారణ మార్చి సరికొత్త ప్రయోగం చేసింది.. ఇక టైటానిక్ క్యాట్ విన్ స్లెట్ లా.. బాండ్ గాళ్ హాలీ బెర్రీ లా, సాల్ట్ ఏంజెలీనా లాగా మారిపోవాలని అయితే అలాంటి స్క్రిప్టు అవి తనకు రావడం లేదని ఆమె నిరాశ వ్యక్తం చేసింది.
చివరిగా ది పవర్ అనే సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఇందులో శృతి హాసన్, విద్యుత్ జామ్వాల్ ప్రధాన పాత్రలు పోషించారు.. ఇకపోతే సౌత్ లో కూడా అవకాశాలు అందుకోవడం కోసం భారీ ప్రయత్నాలు చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.

మరింత సమాచారం తెలుసుకోండి: