సినీ ఇండస్ట్రీ లోనే అత్యంత ప్రాముఖ్యమైన దాదాసాహెబ్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆదివారం రాత్రి ముంబైలో జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఇకపోతే ఇందులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా సినిమా పుష్ప కూడా అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది.. 2022 బెస్ట్ ఫిలిం అఫ్ ది ఇయర్ గా పుష్ప అవార్డును సొంతం చేసుకుంది. ఇండియన్ సినీ ఫిలిం ఇండస్ట్రీలో అరుదైన గౌరవంగా భావించే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును సొంతం చేసుకోవడం గమనార్హం.. ఈ నేపథ్యంలోనే మరొక షార్ట్ ఫిలిం కూడా ప్రత్యేకంగా ఈ అవార్డును సొంతం చేసుకుంది..


ఈ అవార్డుల లో తెలుగు షార్ట్ ఫిలిం మనసానమః అని తెలుగు షార్ట్ ఫిలిం కూడా బెస్ట్ షార్ట్ ఫిలిం పురస్కారాన్ని దక్కించుకోవడం విశేషం.. టాలీవుడ్ నుంచి ఎంపికైన ఏకైక షార్ట్ ఫిలిం మనసానమః అరుదైన రికార్డు సృష్టించడం అందరికీ గర్వకారణం అని చెప్పవచ్చు.. విరాజ్ అశ్విన్ నటించిన షార్ట్ ఫిలిం.. తర్వాత తన రికార్డుల పరంపరను కొనసాగిస్తూ ఉంది.. ఇక అంతే కాదు పలు అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్ లో ఎన్నో అవార్డులను సొంతం చేసుకోవడమే కాకుండా ఆస్కార్ అవార్డు కూడా నామినేట్ కావడం గమనార్హం.తాజాగా జరిగిన దాదాసాహెబ్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో కూడా బెస్ట్ షార్ట్ ఫిలిం అవార్డుకు ఎంపిక అయి..ఒక ప్రత్యేకతను చాటుకోవడం ప్రస్తుతం అందరికీ ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఈ సందర్భంగా మేకర్ ప్రేక్షకులకు అలాగే అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇందులో నటించిన నటీనటుల విషయానికి వస్తే దృషిక చందర్, శ్రీవల్లీ రాఘవేందర్, పృథ్వీశర్మ హీరో హీరోయిన్లు గా నటించడం జరిగింది. ఇక నిర్మాతలుగా గజ్జల శిల్ప వ్యవహరించగా దీపక్ రెడ్డి దర్శకుడిగా తొలి ప్రయత్నం తో షార్ట్ ఫిలిం తెరకెక్కించడం జరిగింది. పోయిన ఏడాది యూట్యూబ్ లో రిలీజ్ అయిన ఈ షార్ట్ ఫిలిం.. ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శించబడి ఏకంగా 900 కుపైగా జాతీయ అంతర్జాతీయ పురస్కారాలను సొంతం చేసుకుంది.

అంతే కాదు ఆస్కార్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుల కి కూడా క్వాలిఫై కావడం గొప్ప విశేషమని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: