తెలుగు చిత్ర పరిశ్రమలో కొన్ని రోజులపాటు హీరో గా ఒక వెలుగు వెలిగినా ఆ తర్వాత కనుమరుగైన నాటి తరం హీరోల గురించి చెప్పుకోవాలంటే ముందుగా వినిపించే పేరు వినోద్ కుమార్. టాలీవుడ్ ప్రేక్షకులకు ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ లో హీరోగా ఎన్నో సినిమాల్లో నటించిన వినోద్ కుమార్ తనదైన ముద్ర వేసుకొని ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. మౌన పోరాటం అనే సినిమాతో ఇండస్ట్రీ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన వినోద్ కుమార్ ఈ సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. తర్వాత మామగారు సీతారత్నం గారి అబ్బాయి, అమ్మ నా కోడలా లాంటి ఎన్నో సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు ఈయన.


 ఇక ఈయన నటించిన పలు సినిమాలకు నంది అవార్డును సైతం అందుకున్నారు అని చెప్పాలి. అయితే కేవలం తెలుగు భాష తో మాత్రమే సరిపెట్టుకోకుండా తమిళ కన్నడ భాషల్లో నటిస్తూ అక్కడ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆ తర్వాత అవకాశాలు లేకపోవడంతో ఇండస్ట్రీలో కనుమరుగైపోయారు. పలు సినిమాల్లో క్యారెక్టర్ కూడా కనిపించారు వినోద్ కుమార్. ఇకపోతే ఇటీవలే ఆలీతో సరదాగా అనే కార్యక్రమానికి వచ్చారు. ఇక ఈ సందర్భంగా తన కెరీర్ గురించి కెరీర్ లో జరిగిన కొన్ని ఆసక్తికర సంఘటనల గురించి విషయాలను అభిమానులతో పంచుకున్నారు వినోద్ కుమార్.


 ఇక ఒక సినిమాలో హీరోయిన్ ఆమని తో రొమాంటిక్ సాంగ్ చేయాల్సి ఉంది. ఇక ఆ రోజే నా భార్య షూటింగ్ జరుగుతున్న ప్లేస్ కి వచ్చింది. అమనితో కలిసి రొమాంటిక్ సాంగ్ చేస్తున్న సమయంలో నా భార్య అది చూడలేక సిగ్గుతో అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది అంటూ చెప్పుకొచ్చాడు వినోద్ కుమార్. అంతేకాదు కర్తవ్యం సినిమా విశేషాలను కూడా పంచుకున్నారు. అయితే సాయికుమార్ తనకు డబ్బింగ్ చెప్పేందుకు నిరాకరించడంతో ఒకసారి అతని కొట్టాలని అనుకున్నాను అంటూ వినోద్ కుమార్ సరదాగా నవ్వేశాడు. మోహన్ గాంధీ, దాసరి,  కోడి రామకృష్ణ లాంటి వారితో సినిమాలు చేయడం ఇక ఇప్పటికి అదృష్టంగా భావిస్తానని వినోద్ కుమార్ తన కెరియర్ విశేషాలను పంచుకున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: