ప్రభాస్ హీరోగా నటించిన రాధేశ్యామ్ చిత్రం మరొక వారం రోజుల్లోనే విడుదల కానుంది. మార్చి 11వ తేదీన ఎంతో గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా పలుమార్లు వాయిదా పడగా చివరకు మార్చిలో విడుదల చేయడానికి సిద్ధం చేశారు. అలా విడుదల తేదీ దగ్గరకు రావడం ఇప్పుడు ఆయన అభిమానులను ఎంతో సంతోషానికి గురి చేస్తుంది. ఎంతో ఆనందాన్ని కలుగ చేస్తుంది. విడుదల వాయిదా పడడం మిగతా ఇష్యూస్ సంగతి పక్కన పెడితే ఈ సినిమాపై మొదటినుంచి భారీగానే అంచనాలు ఉన్నాయి.

ఒక వైపు మేకర్స్ ఇది రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదని చెబుతూ ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని తగ్గిస్తున్న కూడా పాన్ ఇండియా స్టార్ గా మారిన తర్వాత ప్రభాస్ సినిమా పై ఆ మాత్రం అంచనాలు లేకపోతే ఎలా అన్నట్లుగా అభిమానులు వ్యవహరిస్తున్నారు. అలా ఇది ఒక అందమైన ప్రేమ దృశ్యకావ్యంగా అభివర్ణిస్తున్నారు మేకర్స్. అలా ఈ సినిమా మంచి ప్రేమ కథ సినిమా అనగానే అభిమానులు టైటానిక్ లెవల్లో ఈ చిత్రాన్ని ఊహించుకుంటున్నారు. దానికి తగ్గట్లే ఈ సినిమాలో క్లైమాక్స్ లో భారీ నౌక ఒకటి మునిగిపోతుంది.

టైటానిక్ సినిమాలో కూడా ఇలానే ఉంటుంది. అలా కంపేర్ చేస్తూ ఈ చిత్రాన్ని టైటానిక్ సినిమా తో పోలుస్తున్నారు. ఈ విధంగా క్రేజ్ పెంచేయడం వల్ల సినిమా ఫ్లాప్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు కొంతమంది సినిమా విశ్లేషకులు. టైటానిక్ రేంజ్ లో ఈ సినిమా లేకపోతే తప్పకుండా అభిమానులు హర్ట్ అవుతారని దానితో పోల్చడం అంత మంచిది కాదని వారు చెబుతున్నారు. క్రేజ్ మరీ ఎక్కువైతే ప్రేక్షకులు కోరుకున్నంత సీన్స్ లేకపోతే సినిమా ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో అంతా భారీ స్థాయిలో అంచనాలు పెట్టుకోక పోవడమే మంచిది అని అంటున్నారు. ఒక అందమైన పెయింటింగ్ మాదిరిగా ఈ సినిమా ఉంటుంది అనేది చక్కని ఉదాహరణ అని వారు చెబుతున్నరు.

మరింత సమాచారం తెలుసుకోండి: