ఇటీవలి కాలంలో సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న వారు ఆ తర్వాత వెండితెరపై కూడా ఎంట్రీ ఇచ్చి ఆకట్టుకుంటున్న వారు చాలా మంది ఉన్నారు. ఇక ఇలాంటి కోవలోకి వస్తాడు ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి క్రేజ్ ఉన్న హీరో గా మారిపోతున్న నవీన్ పోలిశెట్టి. కేవలం నవీన్ పొలిశెట్టి మాత్రమే కాదు ఇంకా ఎంతోమంది సోషల్ మీడియా స్టార్స్ సినిమాలలో రాణిస్తున్నారు. ఇప్పుడు 30 వెడ్స్ 21 అనే ఒక విభిన్నమైన వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న చైతన్య రావు ఇక ఇప్పుడు వెండితెరపై కూడా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారట.


 30 ఏళ్ళు వచ్చిన ఒక వ్యక్తి తన కంటే తొమ్మిదేళ్ల చిన్న అమ్మాయి ని పెళ్లి చేసుకోవడం ఇక ఈ వెబ్ సిరీస్ లో ఎంతో అమాయకంగా కనిపించడం.. ఇక తన అమాయకత్వం తోనే ప్రేక్షకులను అలరించడం లాంటివి చేశాడు చైతన్య రావు. ఇక ఇప్పుడు వెండితెరపై హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.  పెళ్లిచూపులు డియర్ కామ్రేడ్ దొరసాని ఏబిసిడి లాంటి సూపర్ హిట్ చిత్రాలకు నిర్మాణ భాగస్వామిగా ఉన్న బిగ్ బెన్ సినిమాస్ ఇక ఇప్పుడు కొత్త తరహా చిత్రంతో కొత్త దర్శకులు అవకాశం ఇస్తూ దూసుకుపోతోంది.



 ఇక బిగ్ బెన్ సినిమా సోలో ప్రాజెక్టు నిర్మించడానికి సిద్ధమైంది. ఈ చిత్రంలో చైతన్య హీరోగా నటించబోతున్నాడు. చందు ముద్దు ఇక ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నట్లు తెలుస్తుంది. త్రిల్లర్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా తెరకెక్కబోతుందట. అంతేకాకుండా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ఉండబోతోందని టాక్. ఇక ఇందులో నటీనటులు ఎవరు అన్న విషయాన్ని త్వరలోనే వెల్లడిస్తానని చిత్ర బృందం తెలిపింది. ఇక చైతన్య రావు వెండి తెరపై హీరోగా మారబోతున్నాడు అని తెలియడంతో అభిమానులు అందరూ కూడా ఆనందంలో మునిగి పోతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: