సచిన్ జోషి ఈ పేరు ఇండస్ట్రీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇక దాని తర్వాత ఎన్నో కేసులలో చిక్కుకున్నాడు సచిన్ జోషి . ఇక ఈ కేసుల ద్వారానే ఆయన చాలా మందికి తెలుసు. ఇక ఇదిలా ఉంటే సినిమా అప్డేట్ల కోసం బాగా ఎదురు చూసే తెలుగు ప్రేక్షకులు ఎవరైనా ఒక హీరో పోలీస్ కేసులో ఇరుక్కున్నారు అంటే తెలుసుకోకుండా ఉంటారా అలా తనకు తెలియని వారికి కూడా ఇప్పుడు తెలిసి పోయాడు సచిన్ జోషి .అయితే 2002లో మౌనమేలనోయి అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యాడు ఈయన . ఇక ఆ తర్వాత ఒరేయ్ పండు, నిన్ను చూడక నేనుండలేను, జాక్పాట్, నీ జతగా నేనుండాలి లాంటి సినిమాల్లో నటించాడు.

అయితే  చివరిగా 2017 లో వీడెవడో సినిమాలో నటించి ప్రేక్షకులను అలరించాడు. అయితే  సినిమాల్లో పాపులారిటీ వచ్చిందో లేదో తెలియదు.. కానీ కేసుల ద్వారా మాత్రం బాగానే పాపులారిటీ సంపాదించాడు. ఇకపోతే 2020 మార్చ్ లో సచిన్ జోషి ముంబై పోలీసులు అరెస్టు చేశారు.దానికి  కారణం ఇక ఈ హీరో అక్రమంగా గుట్కా తరలిస్తున్నాడు అన్న ఆరోపణలు.అయితే అరెస్టు చేయడమే కాదు భారీగా గుట్క ని కూడా స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.ఇక ఆ సమయంలో ఇతనిపై క్రిమినల్ పిన్ కోడ్ 41 సెక్షన్ కింద కేసు నమోదైంది.అంతేకాదు ప్రముఖ బిజినెస్ మాన్ విజయ్ మాల్యా కు సంబంధించిన గోవాలోని కింగ్ఫిషర్ విల్లా ను సచిన్ జోషి కొనుగోలు చేశారట ఈయన.

అయితే ఈ విషయంలో ఓంకార్ ఇండస్ట్రీస్ సచిన్ జోషి మధ్య ఆర్థిక లావాదేవీలు అవకతవకలు జరిగినట్లు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అరెస్టు చేయడం జరిగింది. అంతేకాకుండా ఏకంగా 400 కోట్ల రూపాయల అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ క్రమంలోనే మనీలాండరింగ్ నిరోధక చట్టం 2002 కింద సచిన్ జోషి ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అరెస్టు చేశారు.అయితే  ఇవి కాకుండా సచిన్ జోషి పై చాలా కేసులు ఉన్నాయి అన్నది తెలుస్తుంది. ఇకపోతే  ఇప్పుడు చాలా రోజుల తర్వాత సచిన్ జోషి కి బెయిల్ మంజూరు అయింది అని తెలుస్తోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: