కొన్ని సినిమాలు తెరకెక్కించినప్పుడు వాటిని చూస్తే ఆ చిత్రాలు వాస్తవ సంఘటనలకు చాలా దగ్గరగా ఉన్నట్లు గా అనిపిస్తాయి.. అయితే మరికొన్ని సినిమాలు మాత్రం వాస్తవ సంఘటనల ఆధారంగానే కథలు పుడుతూ ఉంటాయి. ఏదైనా జీవిత కథ ఆధారంగా సినిమాలు చేస్తున్నప్పుడు ఎన్నో అభ్యంతరాలు ఎదురవుతూనే ఉంటాయి. అయితే ఇలాంటి చిత్రాలు తెరకెక్కించే టప్పుడు అలాంటివి స్వీకరించడానికి సిద్ధపడే సినిమాని తెరకెక్కించడానికి తీయవలసి ఉంటుంది.. అలా ఒక వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందించిన చిత్రమే "కశ్మీర్ ఫైల్స్ "ఇందులో మిధున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, పల్లవి జోషి ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు.


ఇక ఈ చిత్రానికి నిర్మాతలుగా తేజ్ నారాయణ, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి, పల్లవి జ్యోతి కూడా నిర్మాణంలో భాగస్తులు అయ్యారు. ఈ చిత్రం ఈనెల 11వ తేదీన విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. బడ్జెట్ పరంగా చూసుకుంటే ఇది చాలా చిన్న సినిమా అని చెప్పవచ్చు. అయితే ఈ చిత్రాన్ని చూడటానికి ముంబైలోని థియేటర్లు సరిపోవడం లేదట. అందుచేతనే ఈ సినిమాను థియేటర్లలో చూసేందుకు థియేటర్ల సంఖ్య  పెంచుకుంటూ వెళుతున్నారు చిత్రబృందం.


ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్ కోసం కపిల్ శర్మ అడగగా ఆయన తన టాక్ షోలో ఈ చిత్రానికి సంబంధించి టీమ్ ఎంట్రీ ఒప్పుకోలేదని డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి విమర్శించడం జరిగింది. ఇక ఆయన అలా చెప్పడానికి ముఖ్య కారణం తన సినిమాలో నటించినవారు ఎవరు స్టార్లు కాకపోవడమే అని ఆరోపించారు. ఈ విషయం తెలుసుకున్న నెటిజెన్స్ ఇలాంటి మంచి సినిమాని ప్రమోషన్ సహకరించరా? అంటూ అతని పై ఫైర్ అవుతున్నారు.అలా ఈ గొడవ చాలా పెద్దది అవుతూ ఉండడం జరిగింది. అయితే  అనుపమ్ ఖేర్ జోక్ చేసుకొని ఈ సినిమాలో ఎలాంటి రాజకీయాలు లేవని ఆయన తెలియజేశారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్లకు కపిల్ శర్మని అడగ్గా ఆయన ఏం చెప్పాడంటే ఈ సినిమా చాలా సీరియస్ గా సాగుతోంది.. ఇలాంటి సందేశాత్మక చిత్రాన్ని.. కామెడీ షో లో మాట్లాడడం కరెక్ట్ కాదని తెలియజేశారట.

మరింత సమాచారం తెలుసుకోండి: