పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా మూవీ హరి హర వీర మల్లు షూటింగ్ ని ఎట్టకేలకు ఈ గురువారం హైదరాబాద్ లో ప్రారంభించారు. పద్మశ్రీ తోట తరణి పర్య వేక్షణలో ప్రత్యేకంగా ఈ సినిమా కోసం భారీ సెట్ లని నిర్మించారు. ఆ సెట్ లలో కీలక ఘట్టాల సీన్స్ తో ఈ సినిమా షూటింగ్ ని దర్శకుడు క్రిష్ ప్రారంభించారు. ఇదిలా వుంటే ఈ సినిమాకి సంబంధించిన ఆసక్తికరమైన వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తనయుడు అకీరా నందన్ నటించబోతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. సినిమాలో యంగ్ పవన్ కల్యాణ్ గా అకీరా నందన్ నటించనున్నారని ప్రస్తుతం ఈ పాత్రలో నటించడం కోసం అకీరా ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నారని సమాచారం వినిపిస్తోంది. అకిరాని పవన్ యంగ్ పాత్రలో చూపించాలని డైరెక్టర్ క్రిష్ కి మెరుపులాంటి ఆలోచన వచ్చిందట. ఆ ఆలోచనని వెంటనే పవన్ కళ్యాణ్ కు చెప్పడం..ఆ థాట్ నచ్చడంతో పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయని చెబుతున్నారు.



ఈ వార్త తెలిసిన పవన్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీలవుతున్నారట.హరి హర వీరమల్లుగా రాబిన్ హుడ్ లాంటి గజ దొంగ పాత్రలో పవన్ కల్యాణ్ నటిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ కీలక పాత్రలో బాలీవుడ్ హాట్ లేడీ నర్గీస్ ఫక్రీ నటిస్తున్నారు. ఇదిలా వుంటే ఇటీవల అకీరాకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారిన విషయం తెలిసిందే. ఈ వీడియోని చూసిన వారంతా కూడా అకిరా హీరోగా ఎంట్రీ ఇవ్వడం కోసం రెడీ అవుతున్నాడంటూ నెటిజన్స్ కామెంట్ లనేవి చేశారు.అయితే ఈ కామెంట్ లకు రేణు దేశాయ్ షాకింగ్ రిప్లై ఇవ్వడం జరిగింది. అకీరాకు నటుడిగా మారాలనే ఉద్దేశ్యం లేదని తను అందు కోసం రెడీ కావడం లేదని స్పష్టం చేయడం ఇప్పడు ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో అకిరా 'హరి హర వీరమల్లు' సినిమాలో తెరంగేట్రం చేస్తున్నాడన్నది ఎంత వరకు నిజం అనేది ఇప్పడు పెద్ద చర్చనీయాంశంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: