తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ ను ముందుకు తీసుకు వస్తున్న డిజిటల్ వరల్డ్ లో ఆహా కూడా ఒకటి. ఇందులో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలతోపాటుగా ,వెబ్ సిరీస్ లో కూడా విడుదలవుతూ ప్రేక్షకులను బాగా అలరిస్తుంది. ఇక ఈ క్రమంలోనే తాజాగా" బ్లడీ మేరీ"అనే ఒక మరొక ఆసక్తికరమైన ఒరిజినల్ ని ప్రేక్షకుల కోసం అందుబాటులోకి తీసుకు వస్తోంది ఆహా సంస్ధ. ఇక ఇందులో నివేద పేతురాజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నది. ఈ చిత్రానికి డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు.


ఇన్ని రోజుల పాటు సినిమాలతోనే ప్రేక్షకులను మైమరిపించిన నివేదా.. మొదటిసారిగా ఓటీటీ లో ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇక డైరెక్టర్ కు కూడా ఇదే మొదటి సారి ఓటీటీ లోకి ఎంట్రీ ఇవ్వడం అని చెప్పవచ్చు. ఇప్పటి వరకు విడుదలైన బ్లడీ మేరీ ప్రచార చిత్రాలు, టీజర్, ట్రైలర్ మంచి రెస్పాన్స్ లభించింది. ఇక ఈ రోజు ఈ వెబ్ సిరీస్ ఆహలో  స్ట్రీమింగ్ కాబోతోంది. మేరీ అనే ఒక యువతి.. తనలోని లోపాలను అధిగమించి శత్రువులతో ఎలా పోరాడుతుంది అనే కథాంశంతో ఈ వెబ్ సిరీస్ ను తెరకెక్కించడం జరుగుతుంది.ఇక అంతే కాకుండా తన తోటి వారిని ఎలా కాపాడుకుంటుంది అనే విషయం ప్రేక్షకులకు ఉత్కంఠ పరిస్థితి ఎలా ఉంటుంది అని డైరెక్టర్ తెలియజేశారు. ఇందులో నివేదా తోపాటుగా రాజ్ కుమార్ కసిరెడ్డి, బ్రహ్మాజీ, అజయ్ తదితరులు కీలక పాత్రల్లో నటించనున్నారు. ఈ వెబ్ సిరీస్ ను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మించారు. అంతేకాకుండా వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరించారు. సంగీతం మాత్రం ఎం.ఎం.కీరవాణి తనయుడు కాలభైరవ అందించారు. కార్తీక్ గట్టమనేని సినిమాటోగ్రఫీ గా పనిచేశారు. ఇక ఇటీవల కాలంలో ఆహా లో విడుదల చేసిన ప్రతి వెబ్ సిరీస్ కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. మరి ఈ ముద్దుగుమ్మకు ఇలా అయిన అదృష్టం కలిసి వస్తుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: