కౌశల్య కృష్ణమూర్తి అనే సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఐశ్వర్య రాజేష్ తమిళనాట వరుసగా పెద్ద సినిమాలతో దూసుకుపోతుంది. హీరోయిన్ గా తమిళనాట మంచి స్టార్ డమ్ ని దక్కించుకున్న ఈ బ్యూటీ తెలుగు మూలాలు కలిగి ఉన్న అమ్మాయి అవ్వడంతో ఈమె గురించి ఇక్కడ కూడా ప్రధానంగా చర్చ అనేది జరిగింది.తమిళనాడులో ఒకే సారి పది సినిమాలకు పైగా సైన్ చేసి పెద్ద సంచలనం సృష్టించిన ఐశ్వర్య రాజేష్ త్వరలో డ్రైవర్ జమున అనే సినిమా తో ప్రేక్షకులను పలకరించడానికి ముందుకు రాబోతుంది. తమిళంలో రూపొందిన ఈ సినిమా ను తెలుగు ప్రేక్షకుల ముందుకు డ్రైవర్ జమున పేరుతో విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు విడుదల చేయడం జరిగింది.బాగా సీరియస్ గా ఉండి.. ముఖం పై రక్తపు మరకలు కూడా ఉన్న ఐశ్వర్య రాజేష్ ను ఈ ఫస్ట్ లుక్ లో మనం చూడవచ్చు. ఫస్ట్ లుక్ తోనే సినిమా గురించి ఇండస్ట్రీ వర్గాల్లో ఇంకా అలాగే సోషల్ మీడియాలో కూడా పెద్ద చర్చ అనేది జరిగేలా చేశారు.

ఒక లేడీ క్యాబ్ డ్రైవర్ చుట్టు ఒక రోజు జరిగిన ఆసక్తికర సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించినట్లుగా సినిమా యూనిట్ సభ్యులు చెబుతున్నారు.క్యాబ్ డ్రైవర్ పాత్రలో ఐశ్వర్య రాజేష్ లుక్ ఎంతో ఆకట్టుకునే విధంగా ఉండటంతో పాటు మంచి నటనతో సినిమాలో ఆకట్టుకోబోతున్నట్లుగా చూస్తుంటే తెలుస్తోంది. ఇక సాదారణంగా ట్రావెల్ నేపథ్యంలో ఉన్న సినిమాలు.. రోడ్డు మీద సంఘటనల ఆధారంగా జరిగే సినిమాలు ఎక్కువగా గ్రీన్ మ్యాట్ లో షూట్ చేస్తారు. కాని ఈ సినిమాలో మెజార్టీ శాతం రియల్ లొకేషన్ ల్లోనే షూట్ చేశారని సమాచారం తెలుస్తోంది.పా కిన్స్లిన్ డైరెక్షన్ లో రూపొందిన ఈ సినిమాకు జిబ్రాన్ మ్యూజిక్ ని అందిస్తున్నాడు. గోకుల్ బెన్నీ ఈ సినిమాకు సినిమాటోగ్రఫీని అందిస్తున్నాడు. ఇక ఈ సినిమా లో ఐశ్వర్య రాజేష్ మాత్రమే కాకుండా ఆడుకాలం నరేన్ ఇంకా శ్రీ రంజని అలాగే స్టాండప్ కమెడియన్ అభిషేక్ ఇంకా అలాగే పాండియన్ అలాగే కవిత ఇంకా తదితరులు నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: