దర్శకదిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తీసిన లేటెస్ట్ సెన్సేషనల్ సక్సెస్ఫుల్ సినిమా ఆర్ ఆర్ ఆర్. ఎన్టీఆర్, రామ్ చరణ్ తొలిసారిగా హీరోలుగా నటించిన ఈ సినిమా మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచి, రిలీజ్ తరువాత అందరి అంచనాలు అందుకుని అతి పెద్ద విజయం అందుకుంది. ఎన్టీఆర్ కొమురం భీం గా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటించిన ఈ సినిమాని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య ఎంతో భారీ వ్యయంతో నిర్మించారు.

ఒలీవియా మోరిస్, బాలీవుడ్ భామ అలియా భట్ కథానాయికలుగా నటించిన ఈ మూవీకి కీరవాణి సంగీతాన్ని సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ ని అందించారు. ఇక ఆర్ఆర్ ఆర్ విడుదల తరువాత దాదాపుగా రిలీజ్ అయిన చాలా చోట్ల అత్యద్భుత రీతిలో కలెక్షన్ ని రాబట్టింది. ముఖ్యంగా విదేశాల్లో సైతం అక్కడి అడియానా ఈ మూవీకి బ్రహ్మరథం పట్టారు. ఇటీవల ఒటిటి లో ప్రేక్షకులకి అందుబాటులోకి వచ్చిన ఆర్ ఆర్ఆర్ మూవీ, కేవలం అనతికాలంలోనే దాదాపుగా 57 దేశాల్లో టాప్ ట్రేండింగ్ స్థానంలో నిలవడం విశేషం అని అంటున్నారు విశ్లేషకులు.

ఇక ఈ సినిమా చూసిన అనేకమంది విదేశీ ఆడియన్స్, దర్శకుడు రాజమౌళి, హీరోలు ఎన్టీఆర్, చరణ్ లపై పొగడ్తలు కురిపిస్తుండగా మరికొందరు అయితే ఏకంగా వచ్చే ఏడాది ఆస్కార్ అవార్డుల్లో భాగంగా విదేశీ చిత్రాల క్యాటగిరిలో ఆర్ఆర్ఆర్ తప్పకుండా నిలిచే అవకాశం ఉందని అభిప్రాయపడుతూ సోషల్ మీడియా మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తున్నారు. అంతలా ఆర్ఆర్ఆర్ మూవీ అందరికీ ఎంతో చేరువైంది. మరి నిజంగానే ఆర్ఆర్ఆర్ మూవీ రాబోయే ఆస్కార్ బరిలో నిలుస్తుందో లేదో తెలియాలి అంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే అంటున్నారు విశ్లేషకులు. మొత్తంగా అటు థియేటర్స్ లో ఇటు ఓటిటి లో కూడా అదరగొట్టిన ఆర్ఆర్ఆర్ మూవీ అందరి నుండి ప్రశంసలు అందుకుంటూ ఉండడంతో యూనిట్ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: