విక్టరీ వెంకటేష్ మరియు వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన ఎఫ్3 చిత్రం ఇటీవల విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ను దిల్ రాజు నిర్మించగా సరైన సమయంలో ఈ చిత్రాన్ని విడుదల చేసి భారీ వసూళ్లు అందుకుంటున్నారు.  ఈ సినిమాలో తమన్నా మరియు మెహరీన్ ఇద్దరు హీరోయిన్ లు గా నటించగా ఫస్ట్ వీకెండ్ లో భారీ వసూళ్లను రాబట్టి సూపర్ హిట్ చిత్రం అనిపించుకుంది.

ఈ వీక్ డేస్ లో కూడా జనాలను థియేటర్లకు రప్పించడం కోసం ఇంకా ప్రమోషన్స్ చేస్తూనే ఉన్నారు. అయితే ఈ సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాల్లో కీలకమైన హీరోయిన్ అయిన తమన్నా కనిపించకపోవడం అందరిలో ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది.  వాస్తవానికి తమన్నా ఏదైనా సినిమాని ఒప్పుకున్నాక ఆ చిత్రం యొక్క అన్ని కార్యక్రమాలలో పాల్గొనే తీరుతుంది.అలాంటిది ఎఫ్3 ప్రమోషన్స్ నుంచి ఆమె పెద్దగా కనిపించకపోవడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

నిర్మాత తో సహా అందరూ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్న నేపథ్యంలో ఆమె మాత్రం ఒకే ఒక సుమ ప్రోగ్రాం లో తప్ప వేరే ఏ ప్రోగ్రాం లో పాల్గొనలేదు.  కనీసం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా మిల్కీబ్యూటీ రాలేదు. కారణం ఏదైనా కూడా ఆమె రాకపోవడం కొంత మందిని ఎంతో నిరాశ పరుస్తుంది. దీంతో చిత్ర బృందం కి ఈమెకు మధ్య విభేదాలు వచ్చాయని వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఈ వార్తలపై దర్శకుడు సైతం స్పందించారు. ఆమెకు ఎన్నిసార్లు కాల్ చేసినా కూడా ప్రమోషన్స్ కు తమన్నా రాలేదని వారు చెప్పారు. పలు హిందీ సినిమాలతో బిజీగా ఉన్న తమన్నా ఈ విధమైన ప్రవర్తన చూపించడం సరైనది కాదు అని సినిమా విశ్లేషకులు చెబుతున్నారు. సినిమా విడుదల తేదీని ప్రకటించి చాలా రోజులు అవుతుంది అయినా తమన్నా ఈ విధంగా చేయడం సమంజసం కాదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: