హీరోయిన్ లు  పెళ్లి తర్వాత నటించకూడదని నిబంధన ఏదీ లేదు. అయితే గతంలో పెళ్లి అయిన కథానాయికలకు అవకాశాలు వచ్చేవి కావు. చాలామంది హీరోయిన్లు వారికి పెళ్లి అయినా కూడా సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపుతుంటారు అంతేకాకుండా వారు సినిమాలలో నటించడం కంటిన్యూ చేస్తుంటారు. తాజాగా  ఇప్పుడు పరిస్థితిలో మార్పు వచ్చింది.ఇకపోతే హిందీలో దీపికా పదుకోన్, అనుష్కా శర్మ, సోనమ్ కపూర్ వంటి కథానాయికలు ట్రెండ్ మార్చారు.అయితే నయనతార లవ్ ఎఫైర్ విషయంలో ఎప్పుడూ ఓపెన్‌గా ఉండటం నయన్ స్టైల్. ఇక అందుకే ఆమె ప్రేమ సంగతులంటే జనాల్లో అదో క్రేజ్.  

అయితే మరి, నయనతార సంగతి ఏంటి?ఇదిలావుంటే జూన్ 9న (గురువారం) ఉదయం ఎనిమిది, ఎనిమిదిన్నర ప్రాంతంలో నయనతార, తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్ వివాహ బంధంతో ఒక్కటి అవుతారు.కాగా  పెళ్లి తర్వాత శ్రీమతి కానున్న నయన్, నటనకు దూరంగా ఉండాలనే నిర్ణయం తీసుకున్నారట.ఇప్పుడు  నయనతార చేతిలో కొన్ని సినిమాలు ఉన్నాయి. ఏంటంటే హిందీలో షారుఖ్ ఖాన్ 'జవాన్', తెలుగులో మెగాస్టార్ చిరంజీవి 'గాడ్ ఫాదర్', మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ 'గోల్డ్', తమిళంలో 'ఓ 2', 'కనెక్ట్' సినిమాలు చేస్తున్నారు. కాగా అవి పూర్తయిన తర్వాత కొత్త సినిమాలకు 'ఎస్' చెప్పకూడదని డిసైడ్ అయ్యారట.

అయితే పెళ్లి తర్వాత సినిమాల్లో నటించకూడదని నయనతారకు విఘ్నేష్ శివన్ తల్లి కండిషన్ పెట్టారట. ఇక అందుకని, నటనకు దూరంగా ఉండాలని నిశ్చయించుకున్నారట.నిర్మాతగా కంటిన్యూ అవ్వాలని అనుకుంటున్నారట.ఇకపోతే విజయ్ సేతుపతి, సమంతతో నటించిన 'కన్మణి ఖతీజా రాంబో' సినిమా నిర్మాతల్లో నయనతార కూడా. అంతేకాదు కాబోయే భర్తతో కలిసి తమిళంలో సినిమాలు నిర్మించారు.కాగా  పెళ్లి తర్వాత కూడా సినిమాలు ప్రొడ్యూస్ చేయాలని అనుకుంటున్నారట. ఇక ఇందులో నిజం ఎంత? అనేది కొన్ని రోజుల్లో తెలుస్తుంది.ఇకపోతే కెరీర్ విషయంలో నయనతార ఆచితూచి అడుగులు వేస్తున్నారు. కాగా నయనతారను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అయితే నయన్ విఘ్నేష్ తర్వాత ప్రాజెక్ట్ లతో విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: