టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి టాలెంట్ ఉన్న నటుల్లో ఒకరు అయిన సత్యదేవ్ గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న పాత్రలతో నటుడిగా కెరీర్ ని మొదలు పెట్టిన సత్యదేవ్ తాను నటించిన చిన్న చిన్న పాత్రలతోనే తన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను మెప్పించి ఆ తర్వాత హీరోగా అవకాశాలు దక్కించుకొని హీరోగా నటించిన సినిమాలలో కూడా తన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను అలరించి ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న హీరోల్లో ఒకరిగా కొనసాగుతున్నాడు.

సత్యదేవ్ హీరోగా నటించిన సినిమాలలో బ్లాఫ్ మాస్టర్, ఉమా పరమేశ్వర ఉగ్రరూపస్య సినిమాలు సత్యదేవ్ కు నటుడిగా మంచి గుర్తింపును తీసుకువచ్చాయి. అలాగే ఈ సినిమాలకు ప్రేక్షకుల నుండి, విమర్శకుల నుండి కూడా మంచి ప్రశంసలు దక్కాయి. తాజాగా సత్యదేవ్ 'గాడ్సే' అనే సినిమాలో హీరోగా నటించాడు. కాకపోతే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకోలేకపోయింది. ఇది ఇలా ఉంటే హిట్ ... ఫ్లాఫ్ లతో సంబంధంలేకుండా సత్యదేవ్ వైవిధ్యమైన సినిమాలలో ... నటనకు ప్రాధాన్యత ఉంది నటించే స్కోప్ ఉన్న మూవీలలో నటిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా ప్రస్తుతం సత్యదేవ్ అనేక సినిమాల్లో నటిస్తున్నాడు. ప్రస్తుతం సత్యదేవ్ 'గుర్తుందా శీతాకాలం' సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమా ఆగస్ట్ 5 వ తేదీన విడుదల కాబోతుంది. ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటించింది. 

ఈ సినిమాతో పాటు సత్యదేవ్ కృష్ణమ్మ అనే సినిమాలో కూడా హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా సెప్టెంబర్ 2022 న విడుదల కాబోతోంది. అలాగే రాంసేతు సినిమాలో కూడా సత్యదేవ్ నటిస్తున్నాడు. ఈ సినిమా అక్టోబర్ 24 వ తేదీన విడుదల కాబోతుంది. వీటితో పాటు ఫుల్ బాటిల్ సినిమాలో కూడా సత్యదేవ్ నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ సినిమాలో కూడా సత్యదేవ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా కూడా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఇలా ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో  సత్యదేవ్ వరుస సినిమాల్లో నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: