రీసెంట్ గా సౌత్ ఇండస్ట్రీ నుండి వచ్చిన పాటలలో ప్రేక్షకులను అత్యంత అలరించిన  పాటలలో తళపతి విజయ్ హీరోగా తెరకెక్కిన 'బీస్ట్' సినిమా లోని అరబిక్ కుత్తు పాట ఒకటి. తలపతి విజయ్ హీరోగా నటించిన బీస్ట్ మూవీ కి  నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించగా , ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్న పూజా హెగ్డే ఈ సినిమాలో తళపతి విజయ్ సరసన హీరోయిన్ గా నటించింది. పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన బీస్ట్ సినిమా ఏప్రిల్ 13 వ తేదీన భారీ ఎత్తున తమిళ్ తో పాటు తెలుగు , మలయాళ , కన్నడ , హిందీ భాషల్లో విడుదల అయ్యింది.

మొదటి నుండి సినీ ప్రేమికులు మంచి అంచనాలు కలిగి ఉన్న ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు భారీ రేంజ్ లో కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కినప్పటికీ,  ఈ మూవీ కి బాక్సాఫీస్ దగ్గర మొదటి షో కే నెగటివ్ టాక్ రావడంతో మొదటి రోజు తర్వాత ఈ మూవీ కి కలెక్షన్స్ బాక్స్ ఆఫీస్ చాలా వరకు తగ్గుతూ వచ్చాయి. చివరగా బీస్ట్ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకోలేకపోయింది. ఇలా బీస్ట్ మూవీ  పెద్దగా సక్సెస్ సాధించకపోయినప్పటికీ ఈ సినిమా లోని అరబిక్ కుత్తు పాట మాత్రం రోజుకో రికార్డ్ ను సృష్టిస్తూ ఫుల్ స్పీడ్ లో ముందుకు దూసుకుపోతోంది.

అందులో భాగంగా తాజాగా అరబిక్ కుత్తు పాట ఓ రేర్ మార్క్ వ్యూస్ ను టచ్ చేసింది. తాజాగా ఈ సాంగ్ యూట్యూబ్ లో 150 మిలియన్ వ్యూస్ ను సాధించింది. మొదటగా ఈ మూవీ నుండి విడుదల అయిన అరబిక్ కుత్తు లిరికల్ సాంగ్ రికార్డ్ స్థాయి వ్యూస్ ని సాధించగా ,  ఆ తర్వాత ఈ మూవీ నుండి విడుదల అయిన అరబిక్ కుత్తు వీడియో సాంగ్  కూడా అదిరిపోయే రేంజ్ లో యూట్యూబ్ లో వ్యూస్ ని సాధిస్తోంది. బీస్ట్ మూవీ కి యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ మ్యూజిక్ ని అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: