టాలీవుడ్ లో ఏ హీరో కూడా ఎంజాయ్ చెయ్యలేని స్టార్ షూస్ ని ఎంజాయ్ చేస్తున్న హీరో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్.అయితే బాహుబలి సిరీస్ తో ప్రభాస్ క్రేజ్ పాన్ ఇండియా లెవెల్ లో ఏ రేంజ్ కి పెరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఇక ఈ సినిమా తర్వాత ఆయన చేసిన రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యినప్పటికీ కూడా అవి రెండు మన టాలీవుడ్ స్టార్ హీరోల హిట్ సినిమా రేంజ్ లో వసూలు చేసిన సంగతి మన అందరికి తెలిసిందే.ఇకపోతే ఆయన ఫ్లాప్ సినిమాలే 400 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేస్తున్న ఈ రోజుల్లో..సరైన హిట్ పడితే ఇక స్థాయి వసూళ్లు ఉంటుందో ఊహించడానికి కూడా మన తరం కాదు.

ఇదిలావుంటే ప్రస్తుతం ప్రభాస్ కి ఉన్న లైనప్ చూస్తుంటే భవిష్యత్తు లో బాక్స్ ఆఫీస్ కి ఊపిరి ఆడనిచ్చేలా లేదు.ఇక ప్రస్తుతం ఆయన kgf సిరీస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో సలార్ సినిమా చేస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే.అంతేకాదు ఈ సినిమా తో పాటుగా ఆయన ఆది పురుష్ మరియు ప్రాజెక్ట్ K వంటి సినిమాలు చేస్తున్నాడు.అయితే ఈ మూడు సినిమాలు కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న క్రేజీ సినిమాలే.ఇకపోతే ఈ మూడిట్లో ఒక సినిమా హిట్టైన వెయ్యి కోట్ల గ్రాస్ ని అతి తేలికగా కొల్లగొట్టగలడు ప్రభాస్.అయితే ఈ సినిమాలతో పాటుగా అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తో ప్రభాస్ 'స్పిరిట్' అనే సినిమాని ఒప్పుకున్న సంగతి మన అందరికి తెలిసిందే..

అంతేకాకుండా ఇంకా షూటింగ్ ప్రారంభం కానీ ఈ సినిమా మీద కూడా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు..అయితే  ఇక లేటెస్ట్ గా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా లో ఒక ముఖ్య పాత్ర కోసం తమిళ సూపర్ స్టార్ కమల్ హాసన్ ని ఆ చిత్ర దర్శకుడు సందీప్ రెడ్డి వంగ అడిగినట్టు తెలుస్తుంది.ఇదిలావుంటే ఇటీవలే చెన్నై లో కమల్ హాసన్ ని కలిసి సుమారు గంటసేపు చర్చలు జరిపిన సందీప్ కమల్ హాసన్ ని ఆ ముఖ్య పాత్ర చెయ్యడానికి ఒప్పించినట్టు తెలుస్తుంది.అయితే కమల్ హాసన్ ఇటీవలే విక్రమ్ సినిమా తో ఇండస్ట్రీ రికార్డ్స్ అన్నిటిని బద్దలు కొట్టిన సంగతి మన అందరికి తెలిసిందే.ఇకపోతే ప్రస్తుతం ఆయన విక్రమ్ 2 మరియు ఇండియన్ 2 చిత్రాలలో నటించబోతున్నాడు.ఇక ఈ రెండు సినిమాలు పూర్తి అయినా తర్వాత కమల్ హాసన్ స్పిరిట్ సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యే అవకాశం ఉంది.కాగా పాన్ ఇండియా లెవెల్ లో విపరీతమైన క్రేజ్ ఈ ఇద్దరు కలిస్తే ఇండియన్ బాక్స్ ఆఫీస్ ఏ రేంజ్ లో షేక్ అవుతుందో చూడాలి...!!.

మరింత సమాచారం తెలుసుకోండి: