ఇక 'థాంక్యూ' సినిమా విషయానికి వస్తే.. దీనికి హీరో అక్కినేని నాగచైతన్య ఎంత ఆకర్షణో, అదే స్థాయిలో దర్శకుడు విక్రమ్ కుమార్ కూడా ఆకర్షణ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇతను తెలుగు దర్శకుడు కాకపోయినా కూడా తన కెరీర్లో మరపురాని సినిమాలు తీసిందంతా తెలుగులోనే.ఇక రాజ్ కుమార్ అనే మరో దర్శకుడితో కలిసి 'ఇష్టం' అనే చిత్రంతో తెలుగులోనే అరంగేట్రం చేసిన విక్రమ్..ఆ తర్వాత '13బి' అనే తమిళ చిత్రంతో పాపులారిటీ సంపాదించాడు.ఆపై చాలా ఏళ్లు గ్యాప్ తీసుకుని తెలుగులో తీసిన 'ఇష్క్' సినిమాతో అతడి దశ తిరిగిపోయింది. ఇక విక్రమ్ చేసిన 'మనం' అనే క్లాసిక్ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక ఆ ఒక్క సినిమాతో ఎంతోమందికి ఫేవరెట్ డైరెక్టర్ అయిపోయాడు విక్రమ్. '24' సినిమా కమర్షియల్‌గా అనుకున్న స్థాయిలో ఆడకపోయినా.. దర్శకుడిగా అతడి ముద్రను మాత్రం చూపించింది. 'గ్యాంగ్ లీడర్' సినిమా ఆ స్థాయి చిత్రం కాకపోయినా… అందులో కూడా కొంతమేర తన ప్రతిభను చూపించాడు. కానీ 'థాంక్యూ' సినిమాలో మాత్రం విక్రమ్ చాలా తీవ్రంగా నిరాశ పరిచాడు. దర్శకుడిగా ఎక్కడా తన ముద్ర కనిపించపోవడం చాలామందిని కూడా ఆశ్చర్యం కలిగించింది.సినిమా కథ ఎంత సాధారణంగా ఉన్నప్పటికీ.. కథనంతో మ్యాజిక్ చేయడం విక్రమ్ కుమార్ ప్రత్యేకత.


సన్నివేశాల చిత్రీకరణలో ఒక వైవిధ్యం ఇంకా మంచి ఫీల్ కనిపిస్తుంటుంది. కానీ అవేవీ 'థాంక్యూ' సినిమాలో కనిపించలేదు. ఐతే తెలుస్తున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా ఫస్ట్ కాపీ కంటే ముందు దర్శకుడి ఫైనల్ కట్‌ మాత్రమే కొంచెం మెరుగ్గానే ఉందని.. విక్రమ్ కొన్ని సన్నివేశాలను మంచి ఫీల్‌తో తీశాడని ఇక ముందు అనుకున్న నిడివితో ఉంటే సినిమా ప్రేక్షకులకు కలిగించే అనుభూతి వేరుగా ఉండేదని అంటున్నారు.'అంటే సుందరానికీ' లాంటి చిత్రాలకు నిడివి పెద్ద సమస్య అయిందన్న ఉద్దేశంతో ఎడిటింగ్ పరంగా నిర్మాత దిల్ రాజు చాలా కఠినంగా వ్యవహరించారని.. దీంతో చాలా సన్నివేశాలు అనేవి లేచిపోయాయని.. చైతూ-రాశి మధ్య మంచి సీన్లకు కోత పడడంతో చివర్లో ఫీల్ అనేది పూర్తిగా మిస్ అయిందని.. సినిమాని హడావుడిగా ముగించినట్లు అనిపించిందని.. ఇంకా కాలేజ్ ఎపిసోడ్‌ను తగ్గించి ఈ సన్నివేశాలు పెంచి ఉంటే సినిమా ఇంత పేలవంగా ఉండేది కాదని వారంటున్నారు.ఇదంతా కూడా దిల్ రాజు జోక్యం చేసుకోవడం వల్లే జరిగిందట.

మరింత సమాచారం తెలుసుకోండి: