విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన సినిమా లైగర్. విడుదలకు తేదీ దగ్గరవుతుడడంతో చిత్ర బృందం ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాల వేగం పెంచింది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను ఘనంగా జరిపింది. భారీ కోలాహలం నేపథ్యంలో సుదర్శన్ థియేటర్లో ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. అంత మంది అభిమానుల మధ్య జరిగిన ఈ ట్రైలర్ కు భారీ స్థాయిలో స్పందన వచ్చింది. యూట్యూబ్లో రికార్డుల మీద రికార్డులను సృష్టించింది.

ఆ విధంగా 24 గంటల్లోనే 50 మిలియన్ వ్యూస్ అందుకున్న ఈ టైలర్ సౌత్ ఇండియాలోనే ఒక సెన్సేషనల్ రికార్డు సృష్టించింది అని చెప్పాలి. భవిష్యత్తులో ఈ సినిమా విడుదల తర్వాత ఎలాంటి రికార్డులను సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందరూ కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని చెప్పడానికి ఇదే నిదర్శనం. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను కరణ్ జోహార్ అలాగే ఛార్మీ లు కలిసి నిర్మించారు. ప్రమోషన్ కార్యక్రమాలను కూడా భావి స్తాయిలో చేస్తున్నారు.

బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా తప్పకుండా ఇండస్ట్రీ రికార్డులను తుడిచి పెడుతుంది అని చెబుతున్నారు. ఇటీవలే బాలీవుడ్ లో జరిగిన ఓ ఈవెంట్లో వచ్చిన మాస్ క్రౌడ్ కి విజయ్ దేవరకొండ లో ఉన్న ఫాలోయింగ్ కారణం అంతటి ఫాలోయింగ్ విజయ్ దేవరకొండకు ఉండడం నిజంగా సౌత్ ఇండియా చేసుకున్న గొప్ప పుణ్యమే అని చెప్పాలి మరి ఈ సినిమా విడుదల తర్వాత విజయ్ రేంజ్ ఏ స్థాయిలో పెరుగుతుందో చూడాలి. ఈ సినిమా తర్వాత రెండు పాన్ ఇండియా సినిమాలలో నటిస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఒకటి ఖుషి సినిమా కాగా, మరొకటి పూరి తో కలిసి జనగణమన అనే మరో సినిమా కూడా చేస్తున్నాడు. మరి ఈ రెండు సినిమాలు ఏ స్థాయి లో తెరకేక్కుతాయో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: