ఖిలాడి సినిమాతో భారీ డిజాస్టర్ ని చూసిన రవితేజ ఆ తర్వాత నటిస్తున్న చిత్రం రామారావు ఆన్ డ్యూటీ.. ఈ సినిమాని డైరెక్టర్ శరత్ మండవ దర్శకత్వం వహించారు.. ఈ రోజున ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అయితే ఈ సినిమా ఎలా ఉందనే విషయాన్ని ట్విట్టర్ ద్వారా కొంతమంది తెలియజేశారు వాటి గురించి చూద్దాం. రవితేజ అంటే మాస్ కి కేరాఫ్ అడ్రస్ గానే చెప్పవచ్చు. అందుకని ఆయనకు మాస్ మహారాజా అని బిరుదు కూడా ఇవ్వడం జరిగింది.


అందుకు తగ్గట్టుగానే తన ఎనర్జీకి కమర్షియల్ ఎలివెంట్స్ ఉన్న సినిమాలే ఎక్కువగా తీస్తూ ఉంటారు. అయితే ఎన్నో సినిమాల ప్లాప్  తర్వాత క్రాక్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు రవితేజ. అయితే ఇప్పుడు తన స్టైల్ ని పక్కన పెట్టి ఎనర్జీని కంట్రోల్ చేస్తూ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక రామారావు ఆన్ డ్యూటీ సినిమా కథ విషయానికి వస్తే.. ఈ సినిమా 1995 లో ప్రారంభమవుతుందని అక్కడ రామారావు సబ్ కలెక్టర్ గా పనిచేస్తున్నాడని తెలుస్తుంది..


అయితే అక్కడ చట్టాలకు లోబడి న్యాయం కోసం నిలబడే ఒక ఆఫీసర్ ఉంటాడు. కానీ కొన్ని అడ్డంకుల వల్ల తన ఉద్యోగాన్ని కోల్పోయి సొంత ఊరికి ఎమ్మార్వో గా వెళ్ళవలసి ఉంటుంది. అక్కడ కొంతమంది ఊరు ప్రజలు తప్పిపోతున్నారనే విషయాన్ని తెలుసుకున్న రామారావు.. వారిని చేదించే కేసుల విషయంలో ఆయనకు పలు సంచలన విషయాలు తెలుస్తాయి. వాటికి ఎలా అడ్డుకట్టు వేశారన్నది ఈ సినిమా కథ అన్నట్లుగా తెలుస్తున్నది. ఇక ఈ సినిమా టాక్ విషయానికి వస్తే యావరేజ్ గా ఉన్నట్లు తెలుస్తోంది.. రవితేజ నటన అదిరిపోయింది కానీ కొన్ని సీన్లు చాలా డల్ గా ఉన్నాయి . సాంగ్స్ యావరేజ్ గా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ డైరెక్షన్ చాలా వీక్ గా ఉందని ట్వీట్లు కూడా తెలియజేస్తున్నారు అభిమానులు. ఇక గతంలో సినిమాలతో పోలిస్తే ఈ సినిమా పర్వాలేదు అనిపించింది అన్నట్లుగా మరి కొంతమంది తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: