ప్రేక్షకులు ఎవరూ కూడా అసలు థియేటర్ కి రావట్లేదని సినీ పరిశ్రమ గగ్గోలు పెడుతుంది. టికెట్ ధరలు పెంచడంతో, హాల్స్ లో స్నాక్స్ ఇంకా అలాగే కూల్ డ్రింక్స్ కూడా భారీగా అమ్మడంతో, సినిమాలు త్వరగా ఓటీటీలోకి రావడంతో సామాన్య ప్రజలు థియేటర్ కి రావడం పూర్తిగా మానేశారు.ఇంకా అలాగే ఈ సమస్యలతో పాటు టాలీవుడ్ సమస్యలతో పెద్దలంతా కూడా జనాల్ని థియేటర్స్ కి ఎలా రప్పించాలా అని ఎన్నో రకాలుగా ఆలోచిస్తున్నారు, ఇంకా అలాగే సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. రోజు రోజుకి థియేటర్స్ పరిస్థితి అయితే అసలు మరీ దారుణంగా తయారవుతుంది. ఆఖరికి ఒక టికెట్ కొంటే మరో టికెట్ ఫ్రీ అని పెట్టినా కూడా అసలు జనాలు ఎవరూ కూడా రావట్లేదు.ఇక ఈ మధ్య కాలంలో అయితే వారానికి ఒక పెద్ద సినిమా అయినా రిలీజ్ అవుతుంది టాలీవుడ్ లో. అయినా కూడా అసలు కలెక్షన్లు అనేవి రావట్లేదు. థియేటర్లకు జనాలు అస్సలు రావట్లేదు. ఈ నేపథ్యంలో ఏపీలోని నంద్యాల జిల్లా వెలుగోడులోని రంగా థియేటర్ లో అయితే అక్కినేని నాగ చైతన్య నటించిన థ్యాంక్యూ సినిమా రిలీజ్ అయింది.


కొత్త సినిమా అయినా కానీ థియేటర్ కి అసలు జనాలు అనేవారే రావట్లేదు. దీంతో థియేటర్ యాజమాన్యం రూ.70తో ఒక టికెట్ కొంటే మరొకటి ఫ్రీ అనే ఆఫర్ కూడా పెట్టింది. కనీసం ఈ ఆఫర్ తో అయినా ప్రేక్షకులు క్యూ కడతారని భావించారు. కానీ ఈ హాల్లో కనీసం పావు శాతం కూడా నిండలేదు. దీనికి కారణం ఏంటో అందరికీ తెలిసిందే. ఈ సినిమా ఇటీవలే రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. అందుకే ఎవరూ థియేటర్ల లోకి రావట్లేదు.సినిమా బాగుంటేనే థియేటర్ కి రాని జనం ఇక అట్టర్ ఫ్లాప్ సినిమాకి ఏమోస్తారు.దీంతో ఏం చేయాలో తేలిక థియేటర్ యాజమాన్యం తెగ వాపోతున్నారు. మరి టాలీవుడ్ పెద్దలు ఈ సమస్యలకి పరిష్కారం చూస్తారా,ఇంకా అలాగే జనాలు థియేటర్ కి వచ్చేలా చేస్తారా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: