కన్నడ స్టార్ హీరోల్లో ఒకరు అయినా కిచ్చ సుదీప్ తాజాగా విక్రాంత్ రోనా అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా తాజాగా థియేటర్ లలో విడుదల అయ్యింది. ఈ సినిమా కన్నడ తో పాటు తెలుగు , తమిళ ,  హిందీ , మలయాళ భాషల్లో కూడా ఒకే రోజు భారీ ఎత్తున విడుదల అయ్యింది. భారీ బడ్జెట్ యాక్షన్ హర్రర్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర ఫర్వాలేదు అనే రేంజ్ టాక్ ను తెచ్చుకుంది.  దానితో ఈ మూవీ కి డీసెంట్ కలెక్షన్ లు ప్రపంచ వ్యాప్తంగా దక్కుతున్నాయి. అందులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ మూవీ కి పర్వాలేదు అనే రేంజ్ కలెక్షన్ లు వస్తున్నాయి. ఇప్పటి వరకు రెండు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకున్న విక్రాంత్ రోనా మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్ ల గురించి తెలుసుకుందాం.
 
నైజాం: 58 లక్షలు , సీడెడ్ : 17  లక్షలు , యూ ఏ : 18  లక్షలు , ఈస్ట్ : 10  లక్షలు , వెస్ట్ : 8  లక్షలు ,
గుంటూర్ : 12  లక్షలు , కృష్ణ : 9  లక్షలు , నెల్లూర్ : 6  లక్షలు , రెండు రోజులకు గాను రెండు తెలుగు రాష్ట్రాల్లో విక్రాంత్ రోనా మూవీ 1.38 కోట్ల షేర్ , (2.70 కోట్ల గ్లాస్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసింది. మరి రాబోయే రోజుల్లో బాక్సా ఫీస్ దగ్గర విక్రాంత్ రోనా మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్  కలెక్షన్ లను వసూలు చేస్తుందో చూడాలి. ఈ మూవీ లో జాక్వలిన్ ఫెర్నాండేజ్ ఒక ముఖ్య పాత్రలో నటించగా , అనూప్ బండారి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: