2022 వ సంవత్సరంలో ఇప్పటికే పాన్ ఇండియా సినిమాలు గా విడుదల అయ్యి భారీ బ్లాక్ బస్టర్ విజయాలను బాక్సాఫీస్ దగ్గర అందుకని ప్రపంచవ్యాప్తంగా అదిరిపోయే కలెక్షన్ లను సాధించిన ఆర్ ఆర్ ఆర్ మరియు కే జి ఎఫ్ చాప్టర్ 2 మూవీ ల గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర భారీ బ్లాక్ బస్టర్ విజయాలను సాధించాయి.  ఇది ఇలా ఉంటే బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే కలెక్షన్లను సాధించి సూపర్ విజయాలను నమోదు చేసుకున్న ఈ రెండు సినిమాలు కొంత కాలం నుండి 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లలో కూడా స్ట్రీమింగ్ అవుతున్నాయి. 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లలో కూడా ఈ సినిమాలు అదిరిపోయే రెస్పాన్స్ ను తెచ్చుకున్నాయి. ఇలా బాక్సాఫీస్ దగ్గర 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లలో అదిరిపోయే రెస్పాన్స్ ను తెచ్చుకున్న ఈ రెండు భారీ పాన్ ఇండియా సినిమాలు మరికొన్ని రోజుల్లో బుల్లితెర ప్రేక్షకులను కూడా అలరించబోతున్నట్లు తెలుస్తోంది.

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్ లుగా తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా స్టార్ మా ఛానల్ లో మరి కొన్ని రోజుల్లో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే యాష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కే జి ఎఫ్ చాప్టర్ 2 మూవీ జీ తెలుగు తన వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా టెలికాస్ట్ కానున్నట్లు తెలుస్తోంది. థియేటర్ లలో ,  'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లో అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ ను తెచ్చుకున్న ఈ రెండు సినిమాలు బుల్లితెర ప్రేక్షకులను ఏ రేంజ్ లో అలరిస్తాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: