‘బింబిసార’ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు అతిధిగా జూనియర్ ఎన్టీఆర్ రావడంతో అతడిని చూడటానికి విశేష సంఖ్యలో వచ్చిన అభిమానులు కొంతవరకు షాక్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ రిలీజ్ తరువాత జూనియర్ ఎన్టీఆర్ బయట ఎక్కడా కనిపించలేదు. ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీలోని కొమరం భీమ్ పాత్ర కోసం పెంచుకున్న గుబురు గడ్డం తో పాటు తారక్ ఇప్పటికీ చాల లావుగా కనిపించడం అతడి అభిమానులను ఆశ్చర్య పరిచింది.


వాస్తవానికి త్వరలో కొరటాల శివ దర్శకత్వంలో ప్రారంభం కాబోతున్న మూవీ కోసం జూనియర్ సన్నపడుతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. దీనితో జూనియర్ అభిమానులు తమ హీరోని ‘బింబిసార’ ఫంక్షన్ లో చాల డిఫరెంట్ గా న్యూ లుక్ లో చూస్తామని ఆశ పడ్డారు. అయితే తారక్ ఇప్పటికీ కొమరం భీమ్ లుక్ లోనే ఉండటంతో తమ హీరోని ఈవిధంగానే కొరటాల సినిమాలో కనిపిస్తాడా లేకుంటే కొరటాల మూవీ ప్రారంభం కావడానికి ఇంకా సమయం పడుతుందా అన్న సందేహాలలో తారక్ అభిమానులు ఉన్నట్లు తెలుస్తోంది.


‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ కోసం జూనియర్ చాల కష్టపడినప్పటికీ అతడు నటించిన కొమరం భీమ్ పాత్ర కంటే రామ్ చరణ్ అల్లూరి పాత్రకు ఎక్కువ పేరు ప్రశంసలు చరణ్ కు లభించడం ఒక విధంగా తారక్ అభిమానులకు షాకింగ్ గా మారింది. వాస్తవానికి ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ మల్టీ స్టారర్ అయినప్పటికీ పేరు అంతా చరణ్ ఖాతాలోకి వెళ్ళిపోయింది జూనియర్ అభిమానుల బాధ.


ఒకవైపు చరణ్ కు హాలీవుడ్ ఇండస్ట్రీ నుండి కూడ ఆఫర్లు వస్తూ ఉంటే తారక్ మాత్రం కొరటాల శివ తో ప్రారంభించ వలసిన సినిమా గురించి వెయిట్ చేస్తూ రోజులు గడుపుతున్నాడు. దీనితో మళ్ళీ తమ హీరోను సిల్వర్ స్క్రీన్ పై ఎప్పుడు చూసుకుంటాము అన్న టెన్షన్ జూనియర్ అభిమానులను విపరీతంగా వెంటాడుతోంది..




మరింత సమాచారం తెలుసుకోండి: