టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయిన హను రాఘవపూడి తాజాగా సీతా రామం అనే మూవీ కి దర్శకత్వం వహించిన విషయం మన అందరికీ తెలిసిందే . ఈ మూవీ లో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించగా , మృణాళిని ఠాకూర్ హీరోయిన్ గా నటించింది . రష్మిక మందన ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్ర లో నటించగా , గౌతమ్ వాసుదేవ్ మీనన్ , తరుణ్ భాస్కర్ , భూమిక చావ్లా , సుమంత్మూవీ లో ఇతర ముఖ్యమైన పాత్రల్లో నటించారు .  

సునీల్ , ప్రకాష్ రాజ్ , ప్రియదర్శిమూవీ లో ఇతర కొన్ని పాత్రల్లో నటించారు . ఆగస్ట్ 5 వ తేదీన విడుదల అయిన సీతా రామం మూవీ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తం గా అద్భుతమైన కలెక్షన్ లను రాబడుతు ముందుకు దూసుకు పోతోంది .  సీతా రామం మూవీ తో దర్శకుడు హను రాఘవపూడి కూడా అదిరిపోయే క్రేజ్ లభించింది . ఇది ఇలా ఉంటే దర్శకుడు హను రాఘవపూడి తన తదుపరి ప్రాజెక్ట్ లను అదిరిపోయే రేంజ్ లో సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది .

హను రాఘవపూడి తన తదుపరి సినిమా హై యాక్షన్ మరియు థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది . దీనితో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో లో ఒక అద్భుతమైన థ్రిల్లర్ మూవీ ని కూడా హను రాఘవపూడి తెరకెక్కించ నున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది . ఇలా సీతా రామం మూవీ తో అదిరిపోయే క్రేజ్ ను సంపాదించుకున్న హను రాఘవపూడి తన తదుపరి ప్రాజెక్ట్ లను కూడా అదిరిపోయే రేంజ్ లో సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: