తమిళ సినీ పరిశ్రమకు చెందిన హీరో చీయాన్ విక్రమ్ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితవే.. సుదీర్ఘకాలంగా ఎన్నో సినిమాలలో నటిస్తు ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకున్నారు. ఇక తన నటించే సినిమాలు ఫ్లాప్లు ,సక్సెస్ లు సంబంధం లేకుండా వరుస సింహాలను చేస్తు ఉన్నారు. ఈ మధ్యకాలంలో థియేటర్లకు వచ్చేందుకు చాలా గ్యాప్ తీసుకున్న విక్రమ్ ఇప్పుడు తాజాగా కోబ్రా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ ఈ సినిమా ఎలా ఉందో అంటూ అభిమానుల సైతం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు ఇప్పుడు వారి కోసం చూద్దాం.విక్రమ్ నటించిన కోబ్రా సినిమానీ డైరెక్టర్ R. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి నటించినది. ఈ సినిమాకి సంగీతాన్ని ఏఆర్ రెహమాన్ అందించారు. ఇక ఇందులో క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ మరొక డైరెక్టర్ కీలకమైన పాత్రలో నటించారు. మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ కు తరకెక్కిచ్చిన కోబ్రా చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకుందని చెప్పవచ్చు. ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్,ట్రైలర్ భారీ వ్యూస్ రాబట్టాయి. తెలుగు తమిళ్ వంటి భాషలలో మంచి బజ్ ఏర్పడిందని చెప్పవచ్చు.
కోబ్రా సినిమా దాదాపుగా తెలుగు తమిళ భాషలలో రూ. 60 కోట్లకు పైగా బిజినెస్ జరిగింది. కోబ్రా సినిమాలో విభిన్నమైన నటనను ప్రదర్శించి మరొకసారి తనేంటో ప్రూఫ్ చేసుకున్నాడు విక్రమ్. అయితే ప్రారంభంలో ఈ సినిమా మిక్సెడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఆ తర్వాత బాగుందని పలువురు నెటిజెన్లు సైతం తెలియజేస్తున్నారు. మొదటి భాగం టెర్రిఫిక్ ఇంట్రో సీన్లతో ప్రేక్షకులను మైమరిపించేలా చేశారు విక్రమ్. ఆ తర్వాత మాస్ బ్యాక్ గ్రౌండ్ తో మారిపోయిందనీ కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమా మ్యూజిక్ బ్యాక్ గ్రౌండ్ కూడా బాగా అదిరిపోయింది అని ప్రేక్షకుల సైతం తెలియజేస్తున్నారు. మొత్తానికి సినిమా క్లైమాక్స్లో అదిరిపోయింది అని తెలియజేస్తున్నారు. అయితే సెకండ్ హాఫ్ లో కాస్త నిరాశపరిచినట్లుగా కూడా తెలుస్తోంది. మరి ఈ సినిమా ఎంతటి కలెక్షన్లను రాబడుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: