మహేష్ పుట్టినరోజునాడు ‘పోకిరి’ మూవీ రీ రిలీజ్ చేయించి సూపర్ స్టార్ అభిమానులు కలక్షన్స్ రికార్డులు క్రియేట్ చేసిన పరిస్థితులలో అంతకు మించిన హంగామాను సృష్టించాలి అన్న ఉద్దేశ్యంతో పవన్ పుట్టినరోజునాడు ‘జల్సా’ మూవీని రీ రిలీజ్ చేయించి కలక్షన్స్ రికార్డులు క్రియేట్ చేయడమే కాకుండా తాము మహేష్ అభిమానులకు ఏమాత్రం తగ్గేదే లేదు అంటూ అన్న సంకేతాలు పవర్ స్టార్ అభిమానులు ఇస్తున్నారు.


‘హరి హర వీరమల్లు’ మూవీకి సంబంధించిన లేటెస్ట్ టీజర్ కూడ పవన్ పుట్టినరోజునాడు విడుదల అవుతున్న పరిస్థితులలో అటు ‘జల్సా’ రీ రిలీజ్ పవన్ ‘హరి హర వీరమల్లు’ టీజర్ల హడావిడితో పవర్ స్టార్ పుట్టినరోజు హోరెత్తబోతోంది. ఇప్పటికే సోషల్ మీడియాలో పవన్ అభిమానుల హడావిడి మొదలైంది. తారా స్థాయిలో జరుగుతున్న ఈ హదావిదిని చూసి ఒక ఫ్రెంచ్ డైరెక్టర్ సోషల్ మీడియాలో జోక్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.


పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో వచ్చిన ‘అజ్ఞాతవాసి’ పవన్ సినిమాలలో ఘోరమైన ఫ్లాప్. ఆసినిమా విడుదలకు ముందు ఫ్రెంచ్ జరోమ్ తన ‘లార్గో వించ్’ మూవీని త్రివిక్రమ్ కాపీ కొట్టాడు అంటూ అప్పట్లో నానారగడ చేసిన విషయం తెలిసిందే. చివరకు త్రివిక్రమ్ ఆ ఫెంచ్ డైరెక్టర్ తో మాట్లాడి ఆవిషయం పెద్దది కాకుండా సెటిల్ చేసుకున్నట్లుగా అప్పట్లో గాసిప్పులు కూడ వచ్చాయి.


ఇప్పుడు ‘జల్సా’ రీ రిలీజ్ గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న ఆ హడావిడి చూసి ఆ ఫ్రెంచ్ డైరెక్టర్ ‘కూల్ నేనేమైన గిఫ్ట్ ఇవ్వాలా’ అంటూ పరోక్షంగా పవన్ అభిమానులను అదేవిధంగా దర్శకుడు త్రివిక్రమ్ ను టార్గెట్ చేస్తూ చేసిన కామెంట్స్ పవన్ పుట్టినరోజు సందర్భంగా వైరల్ గా మారాయి. దీనితో ‘జల్సా’ మూవీ కూడ ఏదైనా విదేశీ సినిమాకు కాపీ యా అంటూ మరికొందరు జోక్ చేస్తున్నారు. ఈ హడావిడి ఇలా కొనసాగుతున్నప్పటికీ పవన్ అభిమానుల హడావిడి మాత్రం తారా స్థాయిలోనే ఉంది..  




మరింత సమాచారం తెలుసుకోండి: