టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన సినిమా "లైగర్". ఈ సినిమాని ఎంత డబ్బా కొట్టుకున్నారో రిలీజ్ అయిన తరువాత అంత దారుణంగా ఫ్లాప్ అయింది. ఇక ఈ సినిమా సహా నిర్మాత అయిన ఛార్మిని యూనిట్ లో జనాలంతా కూడా ఆమెను ముద్దుగా బాస్ లేడీ అని పిలుచుకుంటారట. అంటే పని విషయంలో అంత టఫ్ గా ఉంటుందని అర్థం. ఇప్పుడు ఆమె బయ్యర్లకు చుక్కలు చూపిస్తుంది.లైగర్ సినిమా ఫ్లాప్ తో బయ్యర్లు లబోదిబోమంటుంటే, చార్మి మాత్రం చాలామందికి అందుబాటులో లేదట. నష్టాలు భర్తీ చేసేందుకు ఆమె అసలు ముందుకు రావడం లేదంట.పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన లైగర్ సినిమాపై వీళ్ళు భారీ హైప్ క్రియేట్ చేశారు. విజయ్ దేవరకొండ మార్కెట్ ను మించి హైప్ ఇచ్చారు. అలా భారీ రేట్లకు సినిమాను అమ్మేశారు. కట్ చేస్తే, సినిమా అట్టర్ ప్లాప్ అయింది. మొదటి 2 రోజులకే దుకాణం సర్దేసింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో బయ్యర్లంతా నష్టపోయారు.


కనీసం మినిమం నష్టాలతో ఒడ్డునపడిన బయ్యర్ కూడా లేడు. అందరికీ భారీగా డబ్బులు పోయాయి.దీంతో బయ్యర్లంతా ఛార్మిని నష్టపరిహారం కోరారు. అయితే ఛార్మి మాత్రం అందుకు ఒప్పుకోలేదు. జీఎస్టీని తిరిగి ఇచ్చేందుకు మాత్రమే ఆమె అంగీకరించినట్టు సమాచారం. పైగా లైగర్ సినిమాతో తాము కూడా నష్టపోయామని, తమ చేతిలో డబ్బులు లేవని చార్మి చెబుతోందట.ఆచార్య సినిమా టైపులో లైగర్ సమస్యను పరిష్కరించుకోవాలనేది బయ్యర్ల ఆలోచన. పూరి జగన్నాధ్ ఇంటి ముందు లేదా పూరీ కనెక్ట్స్ ఆఫీస్ ముందు బైఠాయించాలని అనుకుంటున్నారు. కానీ ఆచార్య ఫార్ములా ఇక్కడ వర్కవుట్ కాదు. ఎందుకంటే, పూరి-చార్మి అక్కడ వాళ్లకు దొరకరు. దీంతో ఈ పంచాయితీని ఫిలింఛాంబర్ కు చేర్చాలని బాధిత బయ్యర్లు ఆలోచిస్తున్నారు.ఏది ఏమైనా కూడా సినిమా తీయటం చేత కాక అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని బడాయి మాటలు చెప్పి బయ్యర్లని నష్టాల్లో ముంచేశారు పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ, ఛార్మి.

మరింత సమాచారం తెలుసుకోండి: