తెలుగు సినిమా ఇండస్ట్రీ లో హీరోగా ఎన్నో మూవీ లలో నటించిన మంచు విష్ణు గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మంచి విష్ణు ఇప్పటికే డి ,  దేనికైనా రెడీ వంటి విజయవంత మైన మూవీ లతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తన కంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసు కున్నాడు. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం మంచు విష్ణు 'మోసగాళ్లు' అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. 

మూవీ లో కాజల్ అగర్వాల్ ఒక ముఖ్యమైన పాత్రలో నటించగా ,  నవదీప్ ,  నవీన్ చంద్ర ఈ మూవీ లో ఇతర ముఖ్యమైన పాత్రలలో నటించారు. ఈ మూవీ కి జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహించగా , సమ్ సి.ఎస్ ఈ మూవీ కి సంగీతాన్ని అందించాడు. 19 మార్చ్ 2021 వ తేదీన థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను మెప్పించ లేక పోయింది. ఆ తర్వాత కొన్ని రోజులకు ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో లో అందుబాటు లోకి వచ్చింది.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమా మరో 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లోకి కూడా అందుబాటులోకి రాబోతుంది. ఈ సినిమా సెప్టెంబర్ 16 వ తేదీ నుండి ప్రముఖ 'ఓ టి టి' సంస్థలలో ఒకటి అయినటువంటి ఆహా 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో  స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ విషయాన్ని ఆహా 'ఓ టి టి' సంస్థ తాజాగా అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే మంచు విష్ణు తాజాగా జిన్నా అనే మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ మరి కొన్ని రోజుల్లో విడుదల కాబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: