పవన్ కళ్యాణ్ అక్టోబర్ నుండి బస్సు యాత్ర చేసే ఆలోచనలలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈవిషయమై పవన్ నుండి స్పష్టమైన క్లారిటీ ఇప్పటివరకు రానప్పటికీ పవన్ బస్సు యాత్రకు సంబంధించిన రధం రెడీ అవుతున్నట్లుగా సోషల్ మీడియాలో హడావిడి జరుగుతోంది.



హడావిడి చేస్తున్న ఈవార్తలు ప్రకారం పవన్ బస్సు యాత్రకు సంబంధించిన బస్సు ముంబాయ్ లో రెడీ అవుతోందట. ఈ వాహనాన్ని చాల ధృడంగా ఉండేలా డిజైన్ చేస్తున్నారట. ఈ బస్సును ఒక ఆర్మీ వార్ వెహేకల్ లా డిజైన్ చేయిస్తున్నారట. ఈ వాహనానికి సంబంధించి అటు ఇటు బలమైన ప్లాట్ ఫామ్ లు ఉంటాయట.



పవన్ బస్సు చుట్టూ కనీసం 10 మంది బాడీగార్డులు నిరంతరం నిలబడుతూ ఆ బస్సుకు రక్షక కవచాలు లా ఉంటారట. పవన్ బస్సు యాత్రకు సబంధించి డిజైన్ చేయబడుతున్న బస్సు మిలటరీ యాంటిక్ ట్రక్ లా డిజైన్ చేయబడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ బస్సు యాత్ర ఒకేసారి నెలలు తరబడి ఉండకుండా మధ్యమధ్యలో బ్రేక్స్ ఉండేలా డిజైన్ చేస్తున్నట్లు టాక్. అయితే అందరు ఊహిస్తున్నట్లుగా ఈ బస్సు యాత్ర దసరా నుంచి ఉండకపోవచ్చనీ నవంబర్ చిబరి నుండి ప్రారంభం అయ్యే ఆస్కారం ఉంది అని అంటున్నారు.



ఈలోపున పవన్ తన ‘హరి హర వీరమల్లు’ షూటింగ్ కు సంబంధించి తన పెండింగ్ షూటింగ్ పార్ట్ ను పూర్తి చేసి ఆతరువాత బస్సు యాత్ర ప్రారంభిస్తాడనీ అంటున్నారు. అయితే పవన్ ఆలోచనలు నిర్ణయాలు ఏవీ స్థిరంగా ఉండవు కాబట్టి పవన్ బస్సు యాత్రకు సంబంధించి ఒక స్థిర నిర్ణయం వచ్చే వరకు ఈవిషయమై క్లారిటీ ఉండకపోవచ్చు అని అంటున్నారు. పవన్ కళ్యాణ్ పట్ల అతడి అభిమానులలో ఉన్న మ్యానియా తెలిసినారు మాత్రం పవన్ బస్సు యాత్ర చేయడం అంతసులువైన పనికాదనీ అతడి అభిమానులను మేనేజ్ చేయడం కష్టం అన్న అభిప్రాయాలు కూడ ఉన్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: