అందాల ముద్దు గుమ్మ సమంత గురించి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . అందం , అభినయం , నటన ఈ మూడు కల బోసుకున్న నటీమణు లలో ఒకరు అయిన సమంత ఇప్పటి కే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎన్నో విజయ వంతమైన మూవీ లలో నటించడం మాత్రమే కాకుండా దాదాపు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న అందరూ స్టార్ హీరోల సరసన నటించి ఇప్పటికీ కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా కొన సాగుతోంది . ఇలా ఉంటే ఇది ఇలా ఉంటే సమంత ఇప్పటికే ఎన్నో తమిళ మూవీ లలో కూడా నటించి తమిళ సినిమా ఇండస్ట్రీ లో కూడా అదిరి పోయే రేంజ్ క్రేజ్ ను సంపా దించుకుంది .

ఇలా తెలుగు మరియు తమిళ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజీ ను సంపాదించు కున్న సమంత హిందీ లో నేరుగా ఒక్క సినిమా లో కూడా నటించలేదు. ప్రస్తుతం సమంత బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే ఒక క్రేజీ ప్రాజెక్ట్ ని సమంత ఓకే చేసినట్లు కూడా సమాచారం అందుతుంది. అసలు విషయం లోకి వెళితే ...  అమర్ కౌశిక్ దర్శకత్వంలో ఆయుష్మాన్ ఖురానా హీరోగా ఓ హారర్ కామెడీ మూవీ తెరకెక్కనుంది. ఈ మూవీ లో సమంత ఓ యువరాణి పాత్ర ను పోషించనున్నట్టు ఒక వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ మూవీ వచ్చే సంవత్సరం సెట్స్ పైకి వెళ్లనున్నట్లు ,  ఈ మూవీ లో ఆయుష్మాన్ ఖురానా ఓ డ్రాక్యులా తరహా పాత్రలో కనిపించనున్నట్టు ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: