సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్. వైజయంతి మూవీస్ లో హను రాఘవ పూడి దర్శకత్వ లో భారీ స్థాయిలో నిర్మితమైన ఈ సినిమా ఆమెకు ఎంతగా పేరు ప్రఖ్యాతలను తెచ్చిపెట్టింది అంటే వేరే ఏ సినిమాతో ఆమె పరిచయం అయినా కూడా పెద్దగా పేరు రాలేదని చెప్పాలి. ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో పాటు తన సినిమా పాత్ర కూడా ప్రేక్షకులందరికీ బాగా ఎక్కడంతో ఆమెకు ఇంతటి క్రేజ్ వచ్చింది. నూర్జహాన్ పాత్రలో అలాగే సీత పాత్రలో కూడా ఈమె ప్రేక్షకులందరికీ ఎంతగానో ఆకట్టుకుంది.

తెలుగింటి అమ్మాయిలా కనిపించి ప్రేక్షకులను ముక్తులయ్యేలా చేసిన ఈ ముద్దుగుమ్మ అదృష్టం అనుకోకుండా మారిపోయింది. మొదటగా వైజయంతి మూవీస్ ఈ ముద్దుగుమ్మను ఎంపిక చేసింది ప్రాజెక్టు కే సినిమా కోసం. ఆ సినిమాను కూడా వైజయంతి మూవీస్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాలోని హీరోయిన్ పాత్రకు ఈమె బాగుంటుంది అని నమ్మిన దర్శక నిర్మాతలు ఆమెను ఎంపిక చేసి నూర్జహాన్ పాత్రకు ఎంపిక చేశారట. దాంతో ఆమె అదృష్టం మారిపోయింది.

 ఒక సినిమా కోసం అని వచ్చి ఇంకొక సినిమాలో ఎంపిక అయి ఆ చిత్రంతో ఇంతటి సంపాదించుకున్న హీరోయిన్ ఈమె కాబోలు భవిష్యత్తులో ఆమె తన నటనతో ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి. ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ తెలుగులో ఇంతటి సక్సెస్ సాధించడం ఆమె అభిమానులను సంతోష పెడుతుంది. త్వరలోనే ఆమె చేయబోయే తదుపరి సినిమా గురించిన వార్త ప్రేక్షకులకు తెలియపరుస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఆమెను హీరోయిన్ గా పెట్టుకునేందుకు చాలా మంది హీరోలే పోటీపడుతున్నారు. త్వరలోనే ఆమె ఓ సినిమా హీరోఇనే గా నటించే సినిమా ను అనౌన్సు చేయబోతున్నరాని అంటున్నారు. మరి ఈ ముద్దుగుమ్మ ఎలా తన సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: