తాజాగా భారీ అంచనాల నడుమ తమిళ సినిమా ఇండస్ట్రీ నుండి పొన్నియన్ సెల్వన్ అనే మూవీ విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి ఇండియా లోనే అదిరి పోయే రేంజ్ గుర్తింపు ను సంపాదించుకున్న దర్శకులలో ఒకరు అయినటు వంటి మణిరత్నం దర్శకత్వం వహించాడు. రెండు భాగాలుగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. అందులో మొదటి భాగం తాజాగా సెప్టెంబర్ 30 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది.

మూవీ తమిళ భాషతో పాటు తెలుగు ,  హిందీ , కన్నడ , మలయాళ భాషల్లో కూడా ఒకే రోజు విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర మిక్సీడ్  టాక్ లభించింది. అయినప్పటికీ ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా మంచి కలెక్షన్ లు దక్కుతున్నాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని తెలుగు లో ప్రముఖ నిర్మాత మరియు డిస్ట్రిబ్యూటర్ అయినటు వంటి దిల్ రాజు విడుదల చేశాడు. ఈ మూవీ ఇప్పటి వరకు రెండు రోజుల బాక్సా ఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకుంది. ఈ రెండు రోజుల్లో ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్ ల వివరాలు తెలుసుకుందాం.

నైజాం : 2.84 కోట్లు .
సిడెడ్ : 49 లక్షలు .
యు ఏ : 44 లక్షలు .
ఈస్ట్ : 34 లక్షలు .
వెస్ట్ : 26 లక్షలు .
గుంటూర్ : 30 లక్షలు .
కృష్ణ : 30 లక్షలు .
నెల్లూర్ : 21 లక్షలు .
రెండు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో పొన్నియన్ సెల్వన్ మూవీ 5.18 కోట్ల షేర్ , 9.80 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ మూవీ లో చియాన్ విక్రమ్ ,  కార్తీ , జయం రవి , ఐశ్వర్య రాయ్ ,  త్రిష ,  శోభిత ధూళిపాల ముఖ్య పాత్రలలో నటించగా ,  ఏ ఆర్ రెహమాన్ ఈ మూవీ కి సంగీతాన్ని అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: