వరుస విజయాలతో ముందుకు దూసుకుపోతున్న వరుణ్ తేజ్ కు బ్రేకులు వేసింది గని సినిమా. ఆ చిత్రం ప్రేక్షకులను ఏమాత్రం అలరించకపోవడంతో ఒక్కసారిగా ఆయనకు ప్లాప్ వచ్చి చేరినట్లు అయింది. అంతకుముందు ఆయన చేసిన వరుస సినిమాలు థియేటర్లలో మంచి ఫలితాలను రాబట్టుకున్నాయి. మంచి వసూళ్లను కూడా అందుకున్నాయి. ఈ నేపథ్యంలో వరుణ్ ఎంతో కష్టపడి ఇష్టపడి చేసిన గని సినిమా ప్రేక్షకులను ఆదరించకపోవడం నిజంగా ఆయనకు కంటిమీద కునుకు లేకుండా చేసింది అనే చెప్పాలి.

ప్రస్తుతం ఓ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలో చేయబోతున్న వరుణ్ ఒక దర్శకుడితో కలిసి సినిమా చేయాలని గతంలో భావించాడు. ఆయనే ప్రవీణ్ సత్తారు. ఈ దర్శకుడు తో కలిసి వరుణ్ తేజ్ సినిమా చేయాలని చాలా రోజుల క్రితమే డిసైడ్ అయింది కానీ నాగార్జున ది గోస్ట్ సినిమా షూటింగ్లో పాల్గొంటున్న ప్రవీణ్ సత్తార్ కు సమయం దొరక్క పోవడంతో ఆ చిత్రాన్ని ఇప్పుడు వాయిదా వేసుకుంటూ వచ్చారు. ఇటీవలే దసరా కానుకగా గోస్ట్ సినిమా విడుదల అయ్యి ప్రేక్షకులను మెప్పించింది. అయితే అనుకున్న స్థాయిలో ఈ సినిమా ఆడలేదని చెప్పాలి. ఇందులో ముఖ్యంగా కథ యొక్క బ్యాక్ డ్రాప్ ఉండడంతో ఈ సినిమాను ప్రేక్షకులు పెద్దగా ఆదరించలేకపోయారు

కారణం ఏదైనా కూడా ప్రవీణ్ సత్తారు పైనే ఈ సినిమా యొక్క ఫ్లాప్ ప్రభావం బాగా పడిందని చెప్పాలి. ఈ సినిమా యొక్క ఫలితం ఆయన తదుపరి సినిమాలపై ఉంటుంది అని చెప్పడానికి ఇదే చక్కని ఉదాహరణ. వరుణ్ తేజ్ తో చేయవలసిన సినిమాను మధ్యలోనే డ్రాప్ చేసేందుకు సిద్ధమయ్యారట నిర్మాతలు. హీరో కూడా ప్రవీణ్ తో కలిసి ఈ సినిమా చేయడానికి ఇష్టంగా లేరని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ దర్శకుడు మళ్ళీ ఎవరితో సినిమా చేస్తాడా అనేది చూడాలి. గరుడ వేగ సినిమాతో మంచి కం బ్యాక్ ఇచ్చిన ఈ దర్శకుడు ఇప్పుడు మరొకసారి భారీ విజయాన్ని అందుకోవాల్సిన సినిమా చేయవలసి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: