కొద్దికాలంగా ఇండస్ట్రీలో చాలా మార్పులు జరిగాయి. హీరోల క్రేజ్ పరంగా కాకుండా కంటెంట్ ప్రధానంగా సినిమాలను తెరమీదకు తీసుకొస్తున్నారు దర్శకనిర్మాతలు.అయితే.. థియేటర్లలో రిలీజైన సినిమాలన్నీ కొన్ని రోజులకే ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. అదీగాక ఈ మధ్య థియేట్రికల్ సినిమాలతో పాటు ఓటిటి సినిమాలు/వెబ్ సిరీస్ లకు క్రేజ్ పెరిగిపోయింది. ఈ క్రమంలో రీసెంట్ గా థియేటర్స్ లో విడుదలై ప్రేక్షకులను బాగా అలరించిన సినిమాలు చాలానే ఉన్నాయి. అందులో కొన్ని థియేటర్లలో మిస్ అయినా ఓటిటిలో చూసేయొచ్చు.ఓటిటిలో అసలు మిస్ అవ్వకూడని టాప్ 10 సినిమాలు!
సీతారామం: థియేటర్స్ లో విశేషంగా ఆకట్టుకున్న ఈ సినిమా.. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. మిస్ అవ్వకూడని సినిమా ఇది.
తిరు: ధనుష్ హీరోగా నటించిన ఈ లవ్, ఫ్యామిలీ డ్రామా థియేటర్లలో అద్భుత విజయం సాధించింది. ప్రస్తుతం సన్ నెక్స్ట్ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతోంది. అసలు మిస్ అవ్వకండి.
విక్రాంత్ రోణ: కిచ్చా సుదీప్ హీరోగా తెరకెక్కిన ఈ మిస్టరీ థ్రిల్లర్.. థియేటర్లలో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. మంచి థ్రిల్లర్ మిస్ అవ్వకండి.

కార్తికేయ 2: మిస్టరీ థ్రిల్లర్ మూవీగా కృష్ణతత్త్వం జోడించి తీసిన ఈ సినిమా మంచి విజయం అందుకుంది. ప్రస్తుతం ఈ సినిమా జీ5 లో స్ట్రీమింగ్ అవుతోంది మిస్ అవ్వకండి.

777 చార్లీ: ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాను పెట్ లవర్స్ అసలు మిస్ కాకుండా చూడాలి. ప్రస్తుతం ఇది అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది.

కోబ్రా: హీరో విక్రమ్ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాను ఓటిటిలో అసలు మిస్ అవ్వకండి.. ఈ సినిమా ప్రస్తుతం సోనీలివ్ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతోంది.

విక్రమ్: విశ్వనటుడు కమల్ హాసన్ కి కంబ్యాక్ హిట్ ఇచ్చిన ఈ సినిమా యూత్ ని బాగా ఆకట్టుకుంది. ఇంకా ఎవరైనా చూడనివారు ఉంటే.. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో చూసేయండి.

గార్గి: సాయిపల్లవి ప్రధానపాత్రలో నటించిన ఈ సినిమా.. ఎమోషనల్ గా ఫ్యామిలీ ఆడియెన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది. ఈ సినిమాను ఇంకా చూడకపోతే.. సోనీలివ్ లో స్ట్రీమింగ్ అవుతోంది చూసేయండి.పసలపూడి వీరబాబు: కార్తీ హీరోగా నటించిన ఈ ఫ్యామిలీ డ్రామా.. బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అయ్యింది. ఇంకా ఎవరైనా సినిమా చూసి ఉండకపోతే.. అమెజాన్ ప్రైమ్ లో మిస్ అవ్వకుండా చూసేయండి.

లాల్ సింగ్ చడ్డా: ఆమిర్ ఖాన్ హీరోగా వచ్చిన ఈ సినిమా థియేట్రికల్ గా నిరాశపరిచినా.. అసలు మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమా ఇది. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: