సౌత్ లేడి సూపర్ స్టార్ నయనతార తాజాగా తమిళనాడు ప్రభుత్వానికి షాక్ ఇచ్చినట్లు అయింది. ఈ బ్యూటిఫుల్ హీరోయిన్ ఇటీవల ఇద్దరు మగ కవల పిల్లలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.
అక్టోబర్ 9న వారి పూర్వీకుల ఆశీర్వాదంతో ఉయిర్, ఉలగమ్ పుట్టారని సోషల్ మీడియా వేదికగా ప్రకటిస్తూ తమ సంతోషాన్ని అభిమానులతో, ప్రేక్షకులతో పంచుకుంది. తర్వాత నయన సరోగసి ద్వారా పిల్లలకు జన్మనిచ్చిందని వార్త వైరల్ అయింది. ఈ వార్తలపై స్పందించిన తమిళనాడు గవర్నమెంట్ సరోగసి పద్ధతి వివరాలను తెలియజేయాల్సిందిగా కోరిన విషయం తెలిసిందే. తాజాగా తమిళనాడు హెల్త్ డిపార్ట్ మెంట్ కు సమర్పించిన అఫిడవిట్ లో తమ అసలు పెళ్లి తేది చెప్పి షాక్ కు గురి చేసింది నయన-విఘ్నేష్ జంట.

అక్టోబర్ 9న..
సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార, కోలీవుడ్ టాప్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ దంపతులు అక్టోబర్ 9న ట్విన్స్ బేబీ బాయ్స్ ఉయిర్, ఉలగమ్ కు జన్మనిచ్చామని అభిమానులకు శుభవార్త అందించారు. ఈ శుభవార్త విన్న సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలతో నయన్ దంపతులను ఆశీర్వదించారు.
4 నెలలకే పిల్లలు పుట్టడం ఏంటి..
మరోవైపు మాత్రం నయన్-విఘ్నేష్ కు వివాహమైన 4 నెలలకే పిల్లలు పుట్టడం ఏంటనే చర్చ జోరుగా సాగింది. ఈ క్రమంలోనే ఆమె సరోగసి ద్వారా పిల్లలను కనిందని కన్ఫర్మ్ చేసుకున్నారు. దీంతో తమిళనాడు ప్రభుత్వం నయన్ దంపతులు నిబంధనలకు లోబడే సరోగసిని ఉపయోగించారా అని విషయాన్ని తెలియజేయాల్సిందిగా త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసింది.
చట్టబద్ధంగా జరిగిందా..
ఈ కమిటీ ప్రతినిధులు నయనతార-విఘ్నేష్ శివన్ దంపతులు ఆవలంబించిన సరోగసి పద్ధతి చట్టబద్ధంగా జరిగిందా.. లేదా అనే విషయాన్ని విచారించాలని కోరింది. పిల్లలను సరోగసి పద్ధతి ద్వారా కనేందుకు తమిళనాడు ప్రభుత్వం 90 నిబంధనలతో కూడిన ప్రమాణాలను రూపొందించింది.
21 నుంచి 36 ఏళ్ల మధ్యలో..

ఆ రూల్స్ ప్రకారం సంతానోత్పత్తికి సంబంధించిన కణాలను దానం చేసిన మహిళకు 21 నుంచి 36 ఏళ్ల మధ్యలో వయసు ఉండాలని, ఆమె కచ్చితంగా వివాహిత అయి ఉండాలని, అంతేకాకుండా ఆమె తన భర్త అనుమతి తీసుకోవాలని వంటి నిబంధనలు పాటించారా అనే విషయాలపై విచారణ చేయాలని కోరింది సర్కారు.
ఆరేళ్ల క్రితమే పెళ్లి..
ఈ విచారణ క్రమంలోనే తమిళనాడు హెల్త్ డిపార్ట్ మెంట్ కు ఒక అఫిడవిట్ ను సమర్పించింది నయన జంట. నయనతార, విఘ్నేష్ శివన్ ఈ సంవత్సరం జూన్ లో సాంప్రాదాయ బద్ధంగా పెళ్లి చేసుకున్నారని, నిజానికి అధికారికంగా ఆరేళ్ల క్రితమే వారు మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు ఆ అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఆ అఫిడవిట్ తో పాటు వారు పెళ్లి చేసుకున్నట్లు తెలిపే మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా పొందుపరిచారు.
అవాక్కైన సర్కారు..
దీంతో అవాక్కవడం తమిళనాడు ప్రభుత్వం వంతు అయింది. అయితే సరోగసి పద్ధతి చట్టం మనదేశంలో 2022 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారం దంపతులు వివాహమైన ఐదేళ్లైన పిల్లలు పుట్టకుంటేనే ఈ సరోగిసి పద్ధతిని ఉపయోగించాలి. అలాగే ఆ దంపతుల్లో భార్యకు 25 నుంచి 50 ఏళ్ల వయసు, భర్తకు 26 నుంచి 55 ఏళ్ల వయసు ఉండాలనేది నిబంధన. ఇప్పటివరకు నయన్ దంపతులకు పిల్లలు లేరు కాబట్టి ఈ సరోగసి పద్దతిని ఎంచుకున్నట్లు చూపించారు.
గతేడాది డిసెంబర్ లో..
ఈ సరోగసి పద్దతి కోసం గతేడాది డిసెంబర్ లో అగ్రిమెంట్ చేసుకున్నారట నయన విఘ్నేష్ శివన్ దంపతులు. సో ఇలా చూస్తుంటే తాము ఎలాంటి నిబంధనలను అతిక్రమించలేదని నిరూపించింది నయనతార-విఘ్నేష్ శివన్ జంట. ఇక సరోగసికి ఒప్పుకున్న మహిళ నయనతార ఫ్రెండ్ అని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: