కథ బాగుండాలి కానీ భాషతో సంబంధం లేకుండా ఆదరించడానికి ప్రేక్షకులు ఎప్పుడూ రెడీగానే ఉంటారు. ఇందుకు చాలా సినిమాలు సాక్ష్యాలుగా ఉన్నాయి. అదే విధంగా 2020 లో తమిళ్ లో విడుదలైన ఓ మై కడవులే గురించి చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. కానీ తమిల్ లో ఆ సినిమా హిట్ అయింది. ఒక చిన్న కాన్సెప్ట్ ను చక్కని స్క్రీన్ ప్లే తో ఆకట్టుకుని హిట్ కొట్టాడు అశ్వత్ మరిముత్తు. ఈ సినిమాలో ఒక నటనంటే ప్రాణంగా భావించే పాత్రలో అశోక్ సెల్వన్ నటించాడు.. మరియు దేవుడు పాత్రలో విజయ్ సేతుపతి నటించాడు. ఈ సినిమాను ఇప్పుడు తెలుగులో రీమేక్ చేస్తున్నారు.. ఇక్కడ అశోక్ సెల్వన్ పాత్రలో యంగ్ హీరో విశ్వక్ సేన్ మరియు విజయ్ సేతుపతి పాత్రను విక్టరీ వెంకటేష్ చేస్తున్నాడు.

ఈ మధ్య విశ్వక్ సేన్ నటుడిగా బాగా డెవలప్ అయ్యాడు.. ఎంచుకుని కథల విషయంలోనూ పరిణితి చూపిస్తూ హిట్ కొరుకుతున్నాడు. విశ్వక్ లాస్ట్ సినిమా అశోకవనంలో అర్జున కళ్యాణం కూడా డీసెంట్ హిట్ ను సాధించి ఆకట్టుకుంది. దీనితో ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా నుండి ఇప్పటి వరకు విడుదలైన పాటలు మరియు ట్రైలర్ కూడా ఫ్యాన్స్ ను విపరీతంగా థ్రిల్ చేశాయి. రేపు ఈ సినిమా గ్రాండ్ గా థియేటర్ లలో విడుదల కానుంది. పైగా ఈ సినిమాలో వెంకటేష్ నటిస్తుండడంతో మరింత ఆసక్తి కలిగింది.

తమిళ్ లో సూపర్ హిట్ అయిన ఈ సినిమా తెలుగులోనూ అదే ఫలితాన్ని అందిస్తుందా లేదా అన్నది చూడాలి. ఇందులో విశ్వక్ సరసన మిథిలా పాల్కర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు అన్నీ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. మరి ఈ పాగల్ హీరో హిట్ కొడతాడా లేదా అన్నది తెలియాలంటే రేపటి వరకు ఆగక తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి: