తెలుగు సినీ ఇండస్ట్రీలో అప్పట్లో కమెడియన్లలో పేరు బాగా సంపాదించిన వారిలో ఐరన్ లెగ్ శాస్త్రి కూడా ఒకరిని చెప్పవచ్చు. ఇక ఈ నటుడు చేసే కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉంటుంది.


అయితే ఈ నటుడు తాడేపల్లి గూడెం చెందిన వ్యక్తి.. ప్రేమఖైదీ సినిమాతో మొదటిసారిగా పరిచయమైన శాస్త్రి ఆ తర్వాత జంబలకడిపంబ, అప్పుల అప్పారావు వంటి చిత్రాలతో మంచి పేరు కూడా సంపాదించారు. అలా ఇండస్ట్రీలో చాలా త్వరగానే స్టార్ కమెడియన్ గా ఎదిగారు ఐరన్ లెగ్ శాస్త్రి. కెరియర్ సరిగ్గా ప్లాన్ చేసుకోకపోవడం వల్లే ఎంత త్వరగా స్టార్ డం వచ్చిందో అంతే త్వరగా తను తన కెరీర్ ని నాశనం చేసుకున్నారని చెప్పవచ్చు . ఇక అవకాశాలు తక్కువగా అవ్వడంతో మళ్ళీ తమ స్వగ్రామానికి వెళ్లిపోయారట.


 


అయితే ఆర్థికంగా డబ్బులు లేక ఒకవైపు.. అనారోగ్య సమస్యలు మరొకవైపు ఇలా అన్ని చుట్టూ ముట్టడంతో చిన్న వయసులోనే ఆయన మరణించారు. అయితే ఆయన కొడుకు ప్రసాద్ అడప దడపా సినిమాలలో నటించారు. కానీ ఇండస్ట్రీలో మాత్రం ఎటువంటి సపోర్టు అయితే లేకోకుండా ఎదగడం చాలా కష్టమని భావించి.. ఇండస్ట్రీలో ఉండలేక మళ్ళీ సొంత ఊరికి వచ్చి తన ఉద్యోగం చేసుకుంటున్నానని తెలియజేశారట ఐరన్ లెగ్ శాస్త్రి కొడుకు ప్రసాద్. తన తండ్రి మరణించినప్పుడు చూడడానికి కొంతమంది ఇండస్ట్రీ వాళ్ళు వచ్చారు. కానీ తన తండ్రి ఆరోగ్యంతో బాధపడుతున్నప్పుడు ఎవరు కూడా ఆదుకోలేదని తెలియజేశారు.


 


ఏనాడు కూడా తన తండ్రి ఇండస్ట్రీలో పడిన కష్టాలను చెప్పుకోలేదని ఇంట్లో వాటి ప్రస్తావన కూడా చెప్పేవారు కాదని తెలిపారట.. కాకపోతే తనని మాత్రం ఇండస్ట్రీలోకి వెళ్ళవద్దని చదువుకోమని చెబుతూ సలహా ఇస్తుండే వారట. అందరూ రాజేంద్రప్రసాద్ , బ్రహ్మానందంతో శాస్త్రికి ఉన్న అనుబంధం ఎక్కువ కాబట్టి వాళ్లు సహాయం చేసి ఉంటారని అనుకున్నారు. అనీ ఇంటర్వ్యూలో అడగగా.. అలాంటిదేమీ లేదు .. వాళ్ళు ఎవరు అసలు పట్టించుకోలేదు.. ఆయనకు అవకాశాలు రాకుండా కొంతమంది కోస్టార్స్ కూడా చేసినట్లు కొంతమంది తన తండ్రి మరణించాక చెప్పారని.. కొంతమంది అడ్వాన్స్ ఇచ్చి షూటింగ్ సమయానికి మీరు వద్దని చెప్పిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయట. దీంతో తను చాలా డిప్రెషన్ కి వెళ్లి తన సొంత ఊరికి వచ్చేసారని తెలిపారు ప్రసాద్. కేవలం తమ కుటుంబానికి కాదంబరి కిరణ్, సంపూర్ణేష్ బాబు మాత్రమే సహాయం చేశారని తెలియజేశారు. అది ఇప్పుడు తన చెల్లి చదువుకు ఉపయోగపడుతోందని తెలిపారట ప్రసాద్.

మరింత సమాచారం తెలుసుకోండి: