కన్నడ హీరో రిషబ్ శెట్టి డైరెక్ట్క్షన్లో తానే హీరో గా నటిస్తూ చేసిన సినిమా కాంతార అనే చెప్పాలి, ఈ సినిమాకు కథ కూడా ఆయనే రాసుకోవడం గమనార్హం మరీ.

కన్నడలో సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమాని తెలుగు సహా హిందీ భాషల్లో కూడా విడుదల చేశారు. నిజానికి ఈ సినిమాని కేవలం 16 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందించగా ఒక కర్ణాటకలోనే దాదాపు 100 కోట్ల రూపాయల దాకా ఈ సినిమా వసూలు చేసింది అంటా మరీ

హోంబలే ఫిలింస్ బ్యానర్ మీద విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ సినిమా ఇప్పుడు తా ము నిర్మించి న అన్ని సినిమా ల్లో ఎక్కువ గా ప్రేక్షకు లు చూసిన సినిమా గా నిలిచిందని హోంబలే సంస్థ అధికారికంగా  పేర్కొంది,నిజానికి కేజీఎఫ్, కేజీఎఫ్ 2 సినిమాలు ఈ నిర్మాణ సంస్థకి బాగా డబ్బులు తీసుకువచ్చాయి కానీ ఈ సినిమాతో పోల్చుకుంటే కేజిఎఫ్ టికెట్ రేట్లు కాస్త ఎక్కువగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తక్కువ టికెట్ రేట్లతో ఎక్కువ టికెట్లు తెగగా ఈ సినిమా ద్వారా తాము మరో రికార్డు సృష్టించి నట్లు అయిందని ఈ సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది మరి

ఇక ఈ సినిమాను తెలుగు లో గీతా ఆర్ట్స్ బ్యానర్ మీద అల్లు అరవింద్ విడుదల చేయగా. ఈ సినిమాకి అద్భుతమైన కలెక్షన్స్ తెలుగు లో కూడా వస్తున్నాయిరిషబ్ శెట్టి హీరో గా నటించిన ఈ సినిమాలో సప్తమి గౌడ హీరోయిన్ గా నటించింది. అచ్యుత్ కుమార్, కిషోర్, ప్రమోద్ శెట్టి వంటి వారు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఇక ఈ సినిమాలో భూత కోల అనే ఒక ప్రాచీన మంగళూరు ప్రాంతానికి చెందిన ఒక సంప్రదాయ నృత్యాన్ని చేసి చూపించడంతో ఈ సినిమా మీద బాగా ప్రశంసల వర్షం కురిపిస్తోంది.

మరీ ముఖ్యంగా క్లైమాక్స్ లో రిషబ్ శెట్టి నటన చాలా అత్యద్భుతంగా ఉందని కామెంట్ల వర్షం కురుస్తోంది . ఇక ఈ సినిమాలో ఈ పాత్ర చేయక పోతే తనకు మరో అవకాశం దక్కదేమో అనే విధంగా ఆయన నటించి ప్రేక్షకులందరి నీ మై మరచి పోయేలా చేశాడు అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమా తర్వాత అల్లు అరవింద్ రిషబ్ శెట్టితో ఒక సినిమా చేస్తా నని ఇప్పటికే ప్రకటించారు. ఆ సినిమాలో రామ్ చరణ్ హీరోగా నటించే అవకాశం ఉందనే ప్రచారం బాగానే జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: