కన్నడ బ్లాక్ బస్టర్ మూవీ 'కాంతార' మూవీ విడుదలై మొత్తం 25 రోజులు గడుస్తున్నా కలెక్షన్ల జోరు మాత్రం తగ్గడం లేదు.ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కిన దర్శకుడు కమ్ హీరో రిషబ్ శెట్టిపై ప్రతీ ఒక్కరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతోపాటు ఓవర్సీస్ లోనూ దూసుకెళుతోంది. యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన 'కాంతార' ప్రేక్షకులను ఎంతగానో మెస్మరైజ్ చేస్తుంది.ఈ సినిమాను తెలుగులో గీతా ఆర్ట్స్ బ్యానర్లో నిర్మాత అల్లు అరవింద్ సమర్పించారు. ఆయన పెట్టిన దానికి ఇప్పటికే పదింతలు డబ్బులు వచ్చేశాయి. హిందీలో ఈ సినిమాను పెద్దగా ప్రమోషన్ చేయక పోయినప్పటికీ మౌత్ టాక్ తోనే ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారు. ఈ సినిమాకు వీకెండ్లోనే కాకుండా మిగతా రోజుల్లోనూ కలెక్షన్లు ఏమాత్రం తగ్గకపోవడం గమనార్హం. దీపావళి పండుగను పురస్కరించుకొని పలు కొత్త సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. అయినప్పటికీ 'కాంతార' హవా మాత్రం తగ్గడం లేదు. 'కాంతార'కు కూడా దీపావళి సెలవులు కలిసి రావడంతో ఈ మూవీ కన్నడ ఇండస్ట్రీలోని అత్యధిక కలెక్షన్లు రాబట్టిన 'కేజీఎఫ్-1' రికార్డులను త్వరలో బ్రేక్ చేసేలా కన్పిస్తోంది.


కేజీఎఫ్-1 మూవీ ప్రపంచవ్యాప్తంగా 230 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. ఇప్పటికే ఈ సినిమా అన్ని వెర్షన్లు కలుపుకొని 200 కోట్ల గ్రాస్ ను అధిగమించింది. ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళం హిందీలో భారీగా కలెక్షన్లు వస్తుండటంతో 'కాంతార' కేజీఎఫ్-1ను బ్రేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.కానీ 'కేజీఎఫ్-2' సినిమా రికార్డును మాత్రం బ్రేక్ చేసే అవకాశం కన్పించింది. ఈ మూవీ అన్ని వెర్షన్లు కలుపుకొని దాదాపు వెయ్యి కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. దీంతో 'కాంతార' మూవీ 'కేజీఎఫ్-1' కంటే అత్యధికంగా.. 'కేజీఎఫ్-2' కంటే తక్కువ కలెక్షన్లతో సరికొత్త రికార్డు నెలకొల్పే అవకాశం కన్పిస్తోంది. అయితే కాంతార 2 సినిమాని కనుక బాగా తెరకెక్కించి ప్రమోషన్స్ బాగా చేస్తే ఖచ్చితంగా కేజీఎఫ్ 2 రికార్డులు బద్ధలు కొట్టే ఛాన్స్ వుంది.మరి చూడాలి ఆ రికార్డ్ సాధ్యమవుతుందో లేదో..

మరింత సమాచారం తెలుసుకోండి: